
ఈ కారణాలతో వైసీపీ హవా తగ్గుతున్న స్థానాల్లో పాతపట్నం, పాలకొండ సీట్లు ఉన్నాయి...రెండు ఎన్నికల్లోనూ ఈ రెండు సీట్లలో వైసీపీ గెలిచింది...కానీ ఈ సారి మాత్రం రెండుచోట్ల వైసీపీ హవా తగ్గిపోతుంది..నెక్స్ట్ ఈ రెండు చోట్ల వైసీపీ గెలవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక సాలూరు, కురుపాం స్థానాల్లో కూడా సీన్ మారిపోతుందని సమాచారం. ఈ రెండు చోట్ల వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది..కానీ ఇప్పుడు అది టీడీపీ వైపు వెళుతున్నట్లు తెలుస్తోంది.
ఇక పాడేరు, మాడుగుల లాంటి స్థానాల్లో కూడా సీన్ రివర్స్ అవుతుందని తెలుస్తోంది..అలాగే జగ్గంపేట, కొత్తపేట లాంటి సీట్లలో కూడా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అలాగే నూజివీడు, పామర్రు, విజయవాడ వెస్ట్ సీట్లలో కూడా వైసీపీకి వ్యతిరేకత కనిపిస్తోంది. అటు గుంటూరు ఈస్ట్, బాపట్ల, మంగళగిరి సీట్లలో టీడీపీకి అనుకూల పరిస్తితులు కనిపిస్తున్నాయి.
సంతనూతలపాడు, కందుకూరు, కావలి, నెల్లూరు సిటీ, గూడూరు, సర్వేపల్లి సీట్లల్లో వైసీపీ వరుసగా రెండు సార్లు గెలిచింది...కానీ ఈ సారి ఈ సీట్లలో వైసీపీకి గెలిచే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. అలాగే నగరి, పీలేరు, కదిరి, మంత్రాలయం, డోన్, ప్రొద్దుటూరు, మైదుకూరు, రైల్వే కోడూరు సీట్లలో సీన్ రివర్స్ అవుతుంది..మొత్తానికి కొన్ని కంచుకోటల్లో వైసీపీకి దెబ్బపడేలా ఉంది.