సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే కస్టమర్ల సెక్యురిటి కోసం సదరు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.ఇప్పటికే ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.వాట్సాప్‌లో Android, iOS యూజర్ల కోసం అదనపు భద్రతను అందించేందుకు లాక్ ఫీచర్‌ను అందిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ Android స్మార్ట్‌ఫోన్‌లలో లేదా iPhoneలో టచ్ ID లేదా Face IDతో వారి ఫింగర్ ఫ్రింట్ ఉపయోగించి యాప్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఇప్పుడు మెటా యాజమాన్యంలోని యాప్ ఈ సెక్యూరిటీ ఫీచర్‌ని వాట్సాప్ డెస్క్‌టాప్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.


వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌కు పాస్‌వర్డ్‌ను సెటప్ చేయడం ద్వారా యూజర్లు తమ అకౌంట్ హ్యాక్ కాకుండా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వాట్సాప్ కొత్త ఫీచర్‌పై మెసేజింగ్ ప్లాట్‌ఫాం పనిచేస్తోందని WABetaInfo నివేదిక వెల్లడించింది. చాట్‌లకు అనధికారిక యాక్సెస్‌ను నిరోధించడానికి PC లేదా ల్యాప్‌టాప్‌ని గమనించకుండా వదిలేస్తే డెస్క్‌టాప్ కోసం స్క్రీన్ లాక్ యాప్‌కి అదనపు భద్రతను అందిస్తుంది. whatsapp డెస్క్‌టాప్ కోసం స్క్రీన్ లాక్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది.


మరికొద్ది రోజుల్లో బీటా టెస్టర్‌లకు కూడా ఈ వాట్సాప్ డెస్క్ టాప్ ఫీచర్ లాంచ్ కానుంది. ముఖ్యంగా, వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS వెర్షన్‌ల మాదిరిగానే డెస్క్‌టాప్ యూజర్ల కోసం స్క్రీన్ లాక్ ఫీచర్‌ను ఐచ్ఛికంగా ఉంచుతుంది. మెసేజింగ్ యాప్ ఎవరైనా తమ స్క్రీన్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే దానిని మార్చుకోవడానికి లేదా రీసెట్ చేయడానికి దాని యూజర్లను అనుమతిస్తుంది. ఇకపోతే బీటా టెస్టర్‌లకు కంపానియన్ మోడ్‌ను ఫీచర్ రిలీజ్ చేసింది. కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ 2.22.24.18 కోసం whatsapp బీటాతో లాంచ్ అయింది. యూజర్లు వారి ప్రస్తుత whatsapp అకౌంట్ మరొక Android స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌కి లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్లను ఒకేసారి నాలుగు డివైజ్‌లకు కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: