రాజకీయాలలో ఒక్కోసారి విచిత్రకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. రాజకీయంగా మంచి జీవితాన్ని అనుభవించిన నాయకులు కొన్ని సార్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం ఏపీ లో ఒక కీలక నాయకుడు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఫ్యామిలీ గా ఆనం వారికి పేరుంది. నెల్లూరు జిల్లాలో వీరి ఫ్యామిలీ ఏది చెబితే అదే జరుగుతూ ఉండేది. కానీ ఆనం వివేకానందరెడ్డి మరణం అనంతరం ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. ఆనం రామనారాయణరెడ్డి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు... గతంలో ఈయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో ఓడిపోవడంతో సమయస్ఫూర్తితో అప్పట్లో రైజింగ్ లో ఉన్న టీడీపీలోకి జారుకున్నాడు. ఆనం ముందుగానే ఊహించాడో ఏమో తెలియదు కానీ.. 2019  ఎన్నికలకు ముందు జగన్ స్థాపించిన వైసీపీలోకి జంప్ అయ్యాడు. నెల్లూరు లో సీట్ ఆశించినా అక్కడ ఖాళీ లేకపోవడంతో చివరికి వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆనం కు కేటాయించాడు జగన్. రాష్ట్రము అంతటా వీచిన ఫ్యాన్ గాలిలో వెంకటగిరిలో ఆనం కూడా ఎమ్మెల్యే గా గెలిచాడు. అయితే ఏ రాజకీయ నాయకుడు అయినా ఏ విధంగా మనం ఎక్కువకాలం పార్టీలో కొనసాగాలి ? ఎలా హై కమాండ్ ను మెప్పించాలి ? అన్న విషయాలపైన దృష్టిని కేంద్రేకరిస్తారు ... అలా ఉంటేనే ఇప్పటి రాజకీయాలలో నెట్టుకురాగలరు.

కానీ మంత్రి పదవి రాలేదని ఆగ్రహిచిన ఆనం జగన్ ను పార్టీని పరోక్షముగా మీడియా ముందు కామెంట్ చేయడంతో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్న పేరు తప్ప ఏ విధమైన అధికారాలు హక్కులు లేకుండా చేశాడు జగన్. అంతే కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే సీటును కూడా ఆనం కు కాకుండా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇవ్వనున్నాడని ఇప్పటికే తెలిసిపోయింది. మరి ఒక సీనియర్ గా వైసీపీలో ఎంతో కొంత గౌరవంతో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా బలహీనపడిపోయే స్థితికి తెచ్చుకున్నాడు. వైసీపీలో ఎందరో అసంతృప్తి నాయకులు ఉన్నారు.. కానీ బహిరంగంగా సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం శుభపరిణామం కాదు అన్న విషయం అంత రాజకీయ అనుభవం ఉన్న ఆనం కు తెలియకపోవడం కొంత ఆశ్చర్యకరంగా అనిపించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: