
అందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుండి యువగళం అనే పేరుతో నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ పాదయాత్ర గురించి రాష్ట్రంలో బాగా మైలేజ్ వచ్చింది. కాగా ఎంతో నమ్మకంతో మొదలు పెట్టిన ఈ యువగళం యాత్రలో మొదటిరోజే అపశృతి చోటుచేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. నందమూరి తారకరత్న కూడా ఈ యువగళం పాదయాత్రలో పాల్గొన్నాడు.. ఈ పాదయాత్రకు మద్దతుగా పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రావడంతో ఒక్క్కసారిగా తారకరత్న అస్వస్థకు లోనయ్యి పడిపోయాడు.
దీనితో వెంటనే అప్రమత్తం అయిన కార్యకర్తలు ఆయనను కూపంలో మెడిసిల కాలేజీ లో అడ్మిట్ చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం తారకరత్న గుండెకు ఎడమవైపు దాదాపు 90 శాతం వరకు బ్లాక్ అయినట్లు బాలకృష్ణ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం బెంగుళూరు లోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్సను అందిస్తున్నారు. మరి శుభమా అంటూ మొదలు పెట్టిన ఈ పాదయాత్ర ఆదిలోనే హంస పాదు లాగా ఇలా జరగడం ఏమిటని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.