వివేకానందరెడ్డి హత్యకేసులో కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. హత్యకు దారితీసిన కారణాల్లో ఎందులోను దంపతుల పాత్రపై సీబీఐకి అనుమానాలు లేవట. అందుకనే హత్య కుట్రలో వీళ్ళపాత్ర లేదని సీబీఐ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. మామూలుగా అయితే హత్యను అన్నీ కోణాల్లో విచారించి, అవసరమైన వాళ్ళని విచారించాలి. అనుమానితులను, నిందితులను కోర్టులో హాజరుపరిచి హత్యలో ఎవరిపాత్ర ఎంతన్నది సీబీఐ కోర్టుముందుంచాలి. అప్పుడు విచారణలో కోర్టు అన్నీ వివరాలను పరిశీలించి ఎవరి పాత్రేమిటో తేలుస్తుంది.





కానీ ఇక్కడ సీబీఐ తనంతట తానే కొందరిని అనుమానితులుగాను, మరికొందరిని నిందితులుగాను ఫైనల్ చేసేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీత దంపతులకు మాత్రం క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. హత్యకు మూడుకారణాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది రాజకీయం. రెండోది ఆర్ధిక సంబంధం. మూడోది వివాహేతర సంబంధాలు. మొదటిది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడుంది. వివేకా, అవినాష్ భవిష్యత్తు జగన్ చేతిలో ఉంది. కాబట్టి వివేకాను హత్యచేయాల్సిన అవసరం కడప ఎంపీ అవినాష్ కు లేదని క్లియర్ అవుతోంది.





ఇక ఆర్ధిక సమస్యలు. భార్య, కూతురు, అల్లుడి కారణంగా వివేకా డబ్బులకు బాగా ఇబ్బందులు పడినట్లు ప్రచారంలో ఉంది. వివేకా చెక్ పవర్ రద్దుచేయటం, బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేసేయటంతో రోజువారి ఖర్చులకు ఇబ్బందిపడిన రోజులున్నాయట. అందుకనే అందినకాడికి అప్పులుచేశారు. సెటిల్మెంట్ల ద్వారా డబ్బు సంపాదనపై ఎక్కువ ఆధారపడ్డారని ప్రచారంలో ఉంది.





ఇక మూడోది 2010లో షమీమ్ ను రెండో వివాహంచేసుకున్నారు. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. తనపేరు మీదున్న ఆస్తులను రెండోభార్య, కొడుకు పేర్లమీద పెట్టాలని వివేకా అనుకున్నపుడు కూతురు, అల్లుడితో  పెద్ద గొడవలైనట్లు ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని అవినాష్ కూడా చాలాసార్లు చెప్పారు.  షమీమ్ కూడా వివేకాను కూతురు, అల్లుడు బాగా ఇబ్బందులు పెట్టినట్లు సీబీఐకి చెప్పారు. సునీత పేరుమీద రాసిన వీలునామాను కూడా తిరగరాయాలని వివేకా అనుకున్నారని అప్పుడు కుటుంబంలో పెద్ద గొడవలయ్యాయని షమీమ్ ఆరోపించారు. ఈ విషయాలపై సీబీఐ దృష్టిపెట్టకుండా, విచారణ చేయకుండానే సునీత దంపతులకు క్లీన్ చిట్ ఇచ్చేయటం ఎంపీయే సూత్రదారుడని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: