అవినీతి ఆరోపణలపై డీకె శివకుమార్ అరెస్టయి మూడేళ్ల పాటు జైల్లో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టింది. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఏకంగా హెలిక్యాప్టర్ లో వచ్చి జైల్లో ఆయన్ని పరామర్శించారు. దీంతో డీకె శివకుమార్ ఇమేజీ అమాంతం పెరిగిపోయింది. ఆనాడు జైల్లో సోనియాకు ఇచ్చిన మాట నేరవేర్చుకున్నానని శివ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని మాట ఇచ్చానని దాన్ని ఇప్పుడు నిజం చేసి చూపించానని మీడియా ఎదుట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె. శివకుమార్ అన్నారు. దీంతో పట్టు వదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్నడు డీకె శివకుమార్. దాదాపు ఆయన ఆస్తి ఎన్నికల ఆఫడవిట్ లో  చూపించిందే రూ. 1700 కోట్లు . ఇంతటి సంపన్నడు కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో గెలుపు బాట పట్టించాడు.


అయితే చాలా మంది జైలు కెళ్లి వచ్చాడు. ఏం  గెలుస్తాడు లే అనుకున్నారు. కానీ తాను గెలిచి పార్టీని సైతం గెలిపించారు. ప్రస్తుతం సిద్ధ రామయ్య కూడా సీఎం పదవి రేసులో ఉన్నారు. డీకే శివకుమార్ కూడా సీఎం పదవి రేసులో ఉండగా ఇరువురిలో ఎవరికి  కాంగ్రెస్ అధిష్టానం పట్టం కడుతుందో తెలియడం లేదు. దీనిపై ఉత్కంఠ కొనసాగుతుంది.


ఇలా జైలు కెళ్లి వచ్చిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ కూడా సీఎం అయ్యారు. ప్రస్తుతం కర్ణాటకలోనే గాలి జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంతో మంది రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు ఉంటాయి. వారందరూ గెలిచి ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. అదేమిటంటే నేరారోపణలు ఉన్న వారికి ఓటు వేయొద్దని రాజ్యాంగం ఏమైనా చెప్పిందా అంటూ సామాన్య ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎవరిని సీఎంగా నియమిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: