మహానాడు సాక్షిగా తమ్ముళ్ళకు నారా లోకేష్ పెద్ద షాకిచ్చారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతు కష్టపడి పనిచేసేవారికే తమ అధినేత చంద్రబాబునాయుడు టికెట్ల ఇస్తారని చెప్పారు. పాదయాత్రలో ఇప్పటికే టికెట్లు ప్రకటించిన వాళ్ళ పరిస్ధితి ఏమిటని మీడియా అడిగింది. దానికి లోకేష్ తూచ్ అనేశారు. తాను ప్రకటించినంత మాత్రాన టికెట్లు వచ్చేసినట్లు కాదన్నారు. కష్టపడి తమను తాము నిరూపించుకోవాల్సిందే అని బంపరాఫర్ కూడా ఇచ్చారు.

పాదయాత్రలో భాగంగా కొందరికి  లోకేష్  టికెట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. లోకేష్ టికెట్లు ప్రకటించిన వాళ్ళలో కొందరిపై నియోజకవర్గాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. పాదయాత్రలో భాగంగా జరిగిన సమావేశాల్లో కొందరు నేతలను లోకేష్ జనాలకు పరిచయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి అభ్యర్ధులుగా ప్రచారం చేశారు. వీళ్ళకి ఓట్లేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు. ఇంతచేసిన తర్వాత ఇపుడు తూచ్ వాళ్ళంతా అభ్యర్ధులైనట్లు కాదని రివర్స్ గేర్ వేశారు.

లోకేష్ ప్రకటనపై అప్పట్లోనే చాలామందికి అనుమానాలు వచ్చాయి. అయితే ఏమోలే చంద్రబాబునాయుడుతో మాట్లాడిన తర్వాతే టికెట్లు ప్రకటించుంటారని అందరు అనుకున్నారు. తీరాచూస్తే ఇపుడు తాను ప్రకటించినవన్నీ నిజమైన టికెట్లు కాదని చెప్పేశారు. అంటే మరి అభ్యర్ధుల హోదాలో సదరు నేతలు నియోజకవర్గాల్లో పెట్టుకున్న ఖర్చులన్నీ ఏమైనట్లు ? అభ్యర్ధులని చెప్పి టికెట్లు ప్రకటించేసి, ఓట్లేసి గెలిపించాలని జనాలను కోరిన తర్వాత ఇపుడు వాళ్ళెవరు అభ్యర్ధులు కారని అంటే సదరు నేతల పరువేం కావాలి ? తమ మద్దతుదారులకు ఏమి సమాధానం చెప్పుకుంటారు ?

మొత్తానికి అటు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్ధుల పరిస్ధితి కూడా ఇంతేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లోకేష్ కాబట్టి తూచ్ అని తేలిగ్గా చెప్పేశారు మరి చంద్రబాబు ఏమి చెబుతారు ? ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి, చంద్రగిరిలో పులివర్తినాని లాంటి వాళ్ళకి టికెట్లు ప్రకటించేసి ప్రచారం కూడా చేసుకోమన్నారు. చూడబోతే లోకేష్ ప్రకటన బాగా గందరగోళానికి దారితీసేట్లే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: