అమెరికాలో భారతీయుల ప్రభావం పెరిగిపోతోంది అనటానికి ఇదే తాజా నిదర్శనం. అమెరికాలో దీపావళి పండుగను నిర్వహించుకునేందుకు ఆ రోజు సెలవుదినంగా ప్రకటించాలని అమెరికా చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదంపొందటం దాదాపు లాంఛనమనే చెప్పాలి. ఎందుకంటే బిల్లును ప్రవేశపెట్టడంలో రాజకీయ ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఎలాగంటే అగ్రరాజ్యంపై భారతీయుల ప్రభావం పెరిగిపోతోంది. రాజకీయ, ఆర్ధి, పారిశ్రామిక రంగాల్లో అమెరికాలో భారతీయులు బాగా పాతుకుపోతున్నారు.

ఏ రంగంలో చూసినా అమెరికన్ల తర్వాత భారతీయులే ఎక్కువగా కనబడుతున్నారు. గడచిన రెండు ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడిందట. రిపబ్లికన్లు, డెమక్రాట్ల తరపున పోటీచేస్తున్న భారతసంతతి కూడా పెరిగిపోతోంది. చదువుల కోసం అమెరికాకు చేరుకుంటున్న ఇండియన్స్ తర్వాత అక్కడే ఉద్యోగాల్లో చేరుతున్నారు. కొంతకాలం తర్వాత ఉద్యోగాలు మానేసి సొంతంగా కంపెనీలు, వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఈ రంగంలో బాగా నిలదొక్కుకుని తమ వ్యాపారాలను, కంపెనీలను విస్తరిస్తున్నారు.

దీనివల్ల అమెరికాలో భారతీయుల ప్రభావం మెల్లిగా పెరిగిపోతోంది. ఒకపుడు చైనీయుల ప్రభావం బాగా కనిపించేది. కొంతకాలంగా చైనీయుల స్ధానంలో భారతీయుల ఆధిపత్యం పెరిగిపోతోంది. కరోనా వైరస్ కారణంగా కూడా చైనీయుల ఆధిపత్యం పడిపోయింది. దాన్ని భారతీయులు అందిపుచ్చుకుని శరవేగంగా ఎదుగుతున్నారు. ఎప్పుడైతే ఆర్ధికంగా, పారిశ్రామికంగా నిదొక్కుకుంటున్నారో వెంటనే మనవాళ్ళ చూపు సహజంగానే రాజకీయాలవైపు మళ్ళుతోంది. దాంతో అందుబాటులో ఉన్న రిపబ్లిక్, డెమక్రటికి పార్టీల్లో చేరిపోతున్నారు. కౌంటిస్ధాయి ఎన్నికల్లో పోటీచేయటం, గెలవటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో మనవాళ్ళ పలుకుబడి పెరుగుతోంది.

దాంతో పై రెండుపార్టీల అధ్యక్షులు, కీలక నేతలు అనివార్యంగా భారతీయులపై ఆధారపడక తప్పటంలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రాబోయే ఎన్నికల్లో భారతీయుల ఓట్లకోసం పార్టీలు గాలమేస్తున్నాయి. రెండుపార్టీలకు భారతీయుల ఓట్లు అవసరమే కాబట్టి దీపావళి పండుగను సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదించింది కూడా  దిగువసభ సభ్యురాలు గ్రేస్ మింగ్ కావటం గమనార్హం. మొత్తానికి రాబోయే కాలంలో అమెరికాపై భారతీయుల ప్రభావం మరింతగా పెరిగిపోవటం ఖాయమని అర్ధమవుతోంది. మరి వచ్చేఎన్నికల్లో మనవాళ్ళు ఏ పార్టీకి ఓట్లేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: