రాజమండ్రి మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన మొదటివిడత మ్యానిఫెస్టోని చూసిన తర్వాత చాలామందిలో ఇదే అభిప్రాయం పెరిగిపోతోంది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను వ్యతిరేకించిన చంద్రబాబు చివరకు అవే పథకాలను ప్రకటించాల్సొచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా చివరకు సంక్షేమపథకాలే బ్రహ్మాండమని డప్పుకొట్టాల్సిన పరిస్ధితికి జగన్ తీసుకొచ్చారు.





మొదటినుండి సంక్షేమపథకాలకు చంద్రబాబు వ్యతిరేకమే. గతంలో వైఎస్సార్ ప్రకటించిన సంక్షేమపథకాలను కూడా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరు చూసిందే. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంక్షేమపథకాలను ప్రకటించినా ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలుచేయలేదు. దాంతో తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.  సంక్షేమానికి, ఉచితాలకు చంద్రబాబు మొదటినుండి వ్యతిరేకమనే భావనను ఎల్లోమీడియా కలగజేసింది. దాంతో జగన్ను వ్యతిరేకించే వర్గాలన్నీ చంద్రబాబు మ్యానిఫెస్టోపైన ఆశలు పెట్టుకున్నాయి.





తీరాచూస్తే తాజాగా ప్రకటించిన మొదటివిడత మ్యానిఫెస్టోలో అన్నీ ఉచితాలే ఉన్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో 6 హామీలిస్తే ఆరూ సంక్షేమ, ఉచితాలే. దాంతో మధ్య, ఎగువ, ఉన్నతాదాయవర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అధికారంలోకి వస్తే జగన్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలకు మించి అమలుచేస్తానని చంద్రబాబు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకిలా ప్రకటించారంటే జగన్ ట్రాపులో ఇరుక్కుపోయారనే చర్చ పెరిగిపోతోంది. నిజానికి సంక్షేమపథకాలు మాత్రమే ఏ పార్టీని గెలిపించలేవు. అయితే ఆ విషయాన్ని చంద్రబాబు పూర్తిగా  మరచిపోయారు.





2019 ఎన్నికల్లో పోలింగుకు  ముందు చంద్రబాబు ఎన్ని కోట్లరూపాయలను పసుపు-కుంకుమ పథకంలో పంచినా జనాలు ఓట్లేయలేదు. ఆ విషయాన్ని మరచిపోయి ఇతర రాష్ట్రాల్లోని పథకాలను కాపీకొట్టేసి మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించేశారు. అయితే ఇప్పటికే పథకాలను అమలుచేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కాదని చంద్రబాబు హామీలను జనాలు నమ్ముతారా ? హామీలను అమలుచేయటంలో చంద్రబాబుకున్న క్రెడిటుబులిటి అందరికీ తెలిసిందే.  ఏదేమైనా సంక్షేమ, ఉచిత పథకాలను ప్రకటించిన తర్వాత జగన్ ట్రాపులో చంద్రబాబు ఇరుక్కుపోయి విలవిల్లాడుతున్నారు. ముందుముందు హామీలరూపంలో ఇంకెతగా కూరుకుపోతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: