ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుంభకోణాలు జరగడం పెద్ద విషయమేమీ కాదు.. ఆ కుంభ కోణంలో ఉన్న నేరస్థులకు శిక్ష పడిందా అనేదే ప్రజలు కోరుకునేది.. వరుసగా పలువురి టీడీపీ నేతలను అవినీతి కేసుల్లో జైలుకి పంపించాడు.. అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్ రెడ్డి, కోళ్లు రవీంద్ర వంటి వారిని ఇప్పటికే జైలు ఊచలు లెక్కపెట్టించాడు..మరికొంతమంది లిస్టు కూడా తయారు చేస్తున్నారు..యా లిస్టు లో జగన్ పెద్ద తలకాయ, తిమింగలం అయిన చంద్రబాబు ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగినచాలా కుంభ కోణాల్లో చంద్రబాబు ఉన్నాడని ఆరోపణలున్నాయి.. ముఖ్యంగా అమరావతి భూముల విషయంలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి.