తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ‘వైఎస్సార్ ఉచిత విద్యుత్’ పథకం ద్వారా రైతుకు చేసే మేలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని జగన్ భావించారు. ఆ దిశగా ఆలోచించి ఉచిత విద్యుత్ పథకాన్ని కనీసం మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలు చేయాలని సంకల్పించారు. ఇక ఈ విషయంలో ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులను సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు.. ఇక ఉచిత విద్యుత్ పథకం కొరకు ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.వాటికి సంబంధించి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది.