మంత్రి కేటీఆర్ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. వ్యవసాయేతర ఆస్తులను 15 రోజుల్లో ధరణి వెబ్సైట్లో నమోదుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. దసరా నుంచి ధరణి వెబ్‌పోర్టల్ ప్రారంభమవుతుందని చెప్పారు.