జులై నెలనుంచి విశాఖ లో రిజిస్టేషన్స్ పెరిగాయని చెప్పొచ్చు.. ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు ఐదువేల రిజిస్ట్రేషన్స్ జరిగాయి.. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా చాలా పెరిగింది. ఇక రానున్న కాలంలో అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ విశాఖ లో భూములకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.. విశాఖ రాజధానిగా ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతోనే భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు. మరి విశాఖ లో రాజధాని అటు ఇటు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..