ఇటీవలే సోము వీర్రాజు ఫై పార్టీ లో వ్యతిరేకత ఎక్కువైందని చెప్పొచ్చు.. పార్టీలో ఉన్న వారిలో చాలా మందికి సోము వీర్రాజు అంటే పెద్దగా పడడం లేదు. అయినా.. తాజాగా ఉద్యమానికి కలిసివచ్చి.. ఈ రేంజ్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, రోడ్లెక్కడం వెనుక.. వేరే ఆలోచన ఉందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి నాని.. నేరుగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేసిన నేపథ్యంలోనే సీనియర్లు రోడ్లెక్కారని, రాష్ట్ర బీజేపీ విషయంలో కాదనేది పరిశీలకుల మాట. మరి సోము వీరిని తన దారిలోకి తెచ్చుకోగలడా చూడాలి..