టీడీపీ పార్టీ ఇంతటి స్థాయిలో ఉండడానికి కారణం మొదట్లో ఎన్టీఆర్ అభిమానులు అయినా ఇప్పుడు పార్టీ జెండా మోసే కార్యకర్తది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏ పార్టీ కి అయినా కార్యకర్త జెండా పట్టందే ముందుకు నడవదు.. ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ కార్యకర్త జై కొట్టందే గెలవలేడు.. ప్రతి పార్టీ లో వీరి పాత్ర చాలా ఉంటుందని చెప్పొచ్చు.. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు.. కొత్త పార్టీ అయినా టీడీపీ ని అప్పట్లో తొలిసారి అధికారంలోకి వచ్చేలా చేసి వారి కి అధికారం కట్టబెట్టేలా చేసింది వీరే.. అయితే మొదట్లో వీరిని టీడీపీ నేతలు కంటికి రెప్పలా చూసుకున్నా ఈ పుష్కర కాలంగా అసలు పట్టించుకోవట్లేదట..