అవకాశం దొరికినప్పుడల్లా జగన్ పై పైచేయి సాధించాలని చూస్తుంటారు చంద్రబాబు. స్థానిక ఎన్నికలు వస్తే తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో బాబుకి దిక్కుతోచడంలేదు. దీంతో తిరుపతి ఉప ఎన్నికలపై ఆయన దృష్టిపెట్టారు. అభ్యర్థిని ప్రకటించడంలో అధికార పార్టీకంటే ముందున్న బాబు, ప్రచార పర్వంలో కూడా జగన్ ని వెనక్కు నెట్టారు.