తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలలో సరికొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. విజయ్ తో పొత్తు కోసం చాలా పార్టీలు ప్రయత్నిస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి. విజయ్ ఫ్యాన్ బేస్ భారీగా ఉండడంతో అన్ని పార్టీలు మక్కువ చూపుతున్నాయి. అయితే ఈ విషయం పైన టీవీకే పార్టీ మాత్రం బిజెపి పార్టీతో పొత్తు ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి కొన్ని గంటలలో అటు తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇటువంటి క్రమంలోనే తమిళనాడులో బిజెపి, టీవీకే పార్టీల మధ్య పొత్తు విషయంలో మరో సారి వార్తలలో నిలుస్తోంది.


పొత్తులో భాగంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ కీ డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బిజెపి పార్టీ ఆఫర్ చేసిందని ,టీవీకే పార్టీతో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని భాజపా వర్గాలలో కూడా వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి 80 సీట్లు ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చినట్లుగా , అలాగే విజయ్  కూడా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారని వినిపిస్తోంది. కానీ  ముఖ్యమంత్రి పదవి పైన విజయ్ దృష్టి పెట్టడంతో ఈ విషయం ఇప్పుడు కీలకంగా మారిందని వినిపిస్తున్నాయి. ఇరువురు పార్టీల నుంచి ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే పొత్తు గురించి రాలేదు.


కానీ బిజెపి పార్టీతో డీఎంకే పార్టీలతో పొత్తులు ఉండవని విజయ్ మాత్రం ఎన్నోసార్లు తేల్చి చెప్పారు. అయినా కూడా ఇందుకు సంబంధించి వార్తలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన మరొక సారి విజయ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. విజయ్ చివరిగా నటించిన జననాయగన్ సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. దీనివల్ల ఎన్నోసార్లు ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతోంది. మరి ఎన్నికల అనంతరం విజయ్ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: