2004లో వైఎస్‌కి వ్యతిరేకంగా పోరాడిన తెదేపా నాయకుడు సతీశ్ రెడ్డి. 2005 లో కో-ఆపరేటివ్ ఎన్నికల్లో పోటి చెయ్యడానికి సతీశ్ రెడ్డి పులివెందుల లో ప్రచారంలో ఉండగా, ఆయనపై దాడి జరిగింది. దీన్నుంచి తప్పించుకోడానికి ఆయన గన్‌మెన్ కాల్పులు జరపగా ఒకరికి గాయమైంది, కాని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి ఫోన్ చేసి మెజిస్ట్రేట్‌ను రమ్మని చెప్పి సతీశ్ రెడ్డే నేరుగా తుపాకీ తీసుకుని కాల్చారని ఆవిడ చేత తప్పుడు వాంగ్మూలం రాయించి, సతీశ్ రెడ్డిని శాశ్వతంగా జైలుకు పంపించే కుట్ర పన్నారని, నాటి సీఎంతో జడ్జి లాలూచీ పడినట్టు కోర్టు తీర్పు ద్వారా వెల్లడయిందని బాబు అన్నారు. పాదయాత్ర వేళ తెదేపా కు ఈ మెజిస్ట్రేట్‌ సస్పెన్షన్, కోర్టు తీర్పు కొత్త అస్త్రాన్ని ఇచ్చింది. వైఎస్ హయాంలో పులివెందులలో ప్రజాస్వామ్యం లేదని,  రౌడీయిజం, ఫ్యాక్షన్ కక్షలు తప్ప ఏ న్యాయమూ లేదని ఇప్పుడు ఆయని బిడ్డలు రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తున్నారని బాబు ఎద్దేవా చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: