ప్ర‌జ‌ల‌ను సెంటిమెంట్ తో  మ‌భ్య‌పెట్టి  ప్ర‌భుత్వాన్ని  చేజిక్కించుకున్న రాజ‌కీయ పార్టీల తీరు చూస్తే గ‌తంలో రాచ‌రిక వ్య‌వ‌స్థ గుర్తుకు వ‌స్తోంది. రాచ‌రిక వ్య‌వ‌స్థ లో రాజులు ఇత‌ర రాజ్యాల‌పై దండ యాత్ర‌లు చేస్తూ వాటిని  వ‌స‌ప‌రుచుకుంటూ సామ్రాజ్య  విస్త‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌తను ఇచ్చేవార‌ని  చ‌రిత్ర‌లు చెబుతున్నాయి. ఆ స‌మాజంలో పాల‌కుడికి రాజ్య విస్త‌ర‌ణే ప్ర‌ధాన ల‌క్షంగా ఉండేది.  రాజు ప‌రిపావ‌ల‌న ద‌క్ష‌త‌, యుద్ద నైపుణ్యాలు ఇత‌ర రాజ్యాల‌ను కొల్ల‌గొట్టి త‌న రాజ్యంలో క‌లుపుకోవ‌డం పై అధార ప‌డి ఉండేది.త‌న రాజ్యం లోని ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాలు, అభివృద్ది లాంటి స‌మస్య‌లు త‌రువాత‌ స్థానంలో ఉండేవి. రాజు తెలివి తేట‌లు యుద్ద నైపుణ్యం రాజ్య మ‌నుగ‌డ‌గా సాగేది. రాజు  త‌రువాత‌నే ప్ర‌జ‌లు. అందుకే రాచ‌రిక వ్య‌వ‌స్థ‌లో రాజు దైవాంశ‌సంభూతుడుగా పిల‌వబడ్డాడు. బ‌హిర్గ‌త‌, అంత‌ర్గ‌త శాంతి భ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్పడం రాజు ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. రాజు నిర్ణ‌య‌మే శిరోధార్యం. భిన్న అభిప్రాయాల‌కు ఆలోచ‌న‌ల‌కూ పాల‌న‌లో అవ‌కాశ‌ము లేదు. చ‌రిత్ర నిండా పాల‌కుల గొప్ప త‌నాలు యుద్దాలు విజ‌యాలుగా కొన‌సాగుతుంది. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌ధానం. దానిలోనే పాలకుడి ద‌క్ష‌త తెలుస్తోంది. 


రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల భిన్న  ఆలోచ‌న‌ల‌ను ప్ర‌తి బింబిస్తాయి. ప్ర‌జాస్వామ్యంలో పాల‌కులే నిర్ణేత‌లు కారు. పాల‌కులు ఏక పక్ష నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల నిర్ణ‌యాలుగా చెపుకుంటూ  చెలామ‌ణి కావ‌డం నిరంకుశ‌త్వానికి దారి తీస్తుంది. ప్రజా స్వామ్య‌ములో నిరంకుశ‌త్వానికి చొటు లేదు. ఎంత గొప్ప పాల‌కుడైనా ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను గౌర‌వించాలి. రాచ‌రిక వ్య‌వ‌స్థ‌లో సామ్రాజ్య వాద ధోర‌ణి గొప్ప ల‌క్ష‌ణం గా ఉంటుంది. ప్ర‌జా స్వామ్యంలో సామ్రాజ్య వాద ల‌క్ష‌ణం ఫాసిస్టు ల‌క్ష‌ణం గా క‌న‌బ‌డుతుంది. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో సామ్రాజ్య వాద ధోర‌ణిలోనే ప్ర‌భుత్వం న‌డుస్తున్న‌ట్టుగా ఉంది. అన్ని రాజ‌కీయ పార్టీల‌ను అధికార పార్టీ త‌న‌లో విలీనం చేసుకుంటూ విస్తర‌ణ ఆకాంక్ష తో ప‌నిచేస్తుంది. ఇ ప‌ద్ద‌తి రాచ‌రిక పాల‌కుల‌కు నైపుణ్య‌త‌ను చాటి చెప్పుతుంది కానీ, ప్ర‌జాస్వామ్య పాల‌కుల‌కు నియంతృత్వానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ప్ర‌జా స్వామ్యంలో ప్ర‌భుత్వ పాల‌క ప‌క్ష‌ములాగే ప్రతిపక్షం కూడా చాల బ‌లంగా ఉండాలి. అప్పుడే భిన్న స‌మస్య‌లు ప్ర‌భుత్వం దృష్టికి రాగ‌లుగుతాయి. ఎంత గొప్ప పాల‌కుడైనా విధానాల‌ను చ‌ట్ట‌స‌భ‌ల్లో సుదీర్ఘ చ‌ర్చ‌ల ద్వారానే సాధ్య‌మౌతుంది.


తెలంగాణలో ప్ర‌తిప‌క్ష పార్టీ లేకుండా పోతుంది....


ప్ర‌భుత్వాలు ఏక‌ప‌క్షంగా చ‌ట్టాల‌ను తీసుకువ‌స్తే కాల గ‌మ‌నంలో అవి మ‌నుగ‌డ  సాగించ‌లేవు. ప్ర‌తి ప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వానికి ప‌ర్య‌వేక్ష పాత్ర పోషించాలి. శిల‌గా ఉన్న దానిని క‌రిగించి సాన‌బెట్టి తుది మెరుగులు దిద్దిన‌ప్పుడే బంగారంగా అందుబాటులోకి వ‌స్తుంది.  ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ ద్వారా ప్ర‌భుత్వానికి తెలుపుతాయి, ప్ర‌భుత్వానికి అన్ని తెలుసు అని, ప్ర‌తిపక్షం అవ‌స‌రం లేద‌నే ధోర‌ణి ప్ర‌జాస్వామ్యంలో చెడుకు దారి తీస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఇదే వైఖరి తో ఉంది. ప్ర‌జాస్వామ్యం అంటేనే భిన్న ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాలు, చర్చ‌లు. ఇదేదీ లేకుండా ప్ర‌భుత్వ‌మే అన్ని నిర్వ‌హిస్తుందనుకోవ‌డం పొర‌పాటు. ఎవ‌రి స‌మ‌స్య‌కు వారె  తీర్పిరి కాలేరు. తామే తీర్ప‌రులం అనుకుంటే సరిదిద్దుకోలేని పొర‌పాట్లు జ‌రుగుతాయి. పాల‌కుడికి వ్య‌క్తి పూజ ఎక్కువ అయితే చ‌ర్చ‌లు ఉండ‌వు. ప్ర‌జా ప్ర‌తినిధులు కేవ‌లం కీలు బొమ్మ‌లాగా మారి పోయి పాల‌కులు నిరంకుశ‌లుగా మారే ప్ర‌మాదం ఉంది. తెలంగాణ‌లో ప్రజా ప్ర‌తినిధులు ఇదే ప‌రిస్థితులోకి మారిపోయారు. నాయ‌కత్వం ప‌ట్ల విదేయ‌త ఉండాలి కానీ, గుడ్డిగా అనుస‌రించ‌డం మంచిది కాదు. ప్ర‌జా ప్ర‌తినిదుల అభిప్రాయాలు ప్ర‌భుత్వం పరిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు.

తెలంగాణ ఉద్య‌మనాయ‌కుల‌కు తీవ్ర‌ అన్యాయం....
 
ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను అనుస‌రిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏక‌వ్య‌క్తి  పాల‌న‌గా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విషయం ఏమిటంటే... రాష్ట్ర ఏర్పాటు ఉద్య‌మ స‌మ‌యంలో ఎవ‌రైతే విమ‌ర్శ‌లు చేసారో ఉద్య‌మాన్ని బ‌ల‌హీనం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేసారో వారిని పార్టీ లోకి చేర్చుకోవ‌డం. కేవ‌లం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌కుండా చేసుకోవ‌డం కోస‌మే. ఉద్య‌మ స‌మ‌యంలో అండ‌గా ఉంది న‌ష్ట‌పోయిన నాయ‌కులూ కేవ‌లం ప్రేక్ష‌కుల్ల‌గా మిగిలిపోవ‌డం జ‌రుగుతుంది. ఉద్యమంలో ప‌నిచేసిన నాయ‌కులూ మాట్లాడ‌పోవ‌డానికి కార‌ణ‌మూ క‌నీసం వారికీ ద‌క్కాల్సిన స్థానానికి కూడా వొదిలి పెట్టుకోవడానికి సిద్ధంగా లేక‌పోవ‌డం. తెలంగాణ ఉద్య‌మంలో క‌ష్ట ప‌డ్డవారికి ప‌ద‌వులు ద‌క్కాలి. పాల‌న‌లో భాగ స్వామ్యం ఉండాలి. దీనికి భిన్నంగా ప్ర‌భుత్వంలో ఉద్య‌మ నాయ‌కుల కంటే  ఉద్య‌మ వ్య‌తిరేక నాయ‌కులూ గొప్ప నాయ‌కులుగా చెలామ‌ణి అవుతున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు అధికార వ్య‌మోహం ఏవిధంగా ఉందో  ఉభ‌య రాష్ట్రాల్లో జ‌రుగుతున్న రాజ‌కీయ వ‌ల‌స‌లు చూస్తే  అర్థ‌మౌతుంది. అధికార పార్టీలోకి మారుతున్న ప్రతి శాస‌న స‌భ్యుడు త‌ను నియోజక వర్గ అభివృద్ది కోసమేనని చెప్పు తున్నారు. 

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించ‌ని స‌ర్కార్....

దీన్ని బట్టి అధికార పార్టీల నియోజక వర్గాల్లో నే అభివృద్ది జరుగుతుందని ఇతర పార్టీల.. నియోజక వర్గాల్లో అభివృద్ది జరుగడం లేదని అర్ధం వస్తున్నది కదా? ఇది ప్రజస్వామ్యంలో సమంజసమేనా అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది లేకుంటే జరుగదు అనే అబిప్రాయం ఏ విధంగా సరి అయినది కాదు. పార్టీలు ప్రతి పక్షం కావచ్చు కానీ ప్రజలు కాదు. ప్రతిపక్ష పార్టిలున్న నియోజక వర్గాల్లో అభివృద్ది చేయక పోవడం ప్రజల్ని ప్రతిపక్ష ప్రజలుగా చూసినట్టు కాదా? ఇది ప్రజాస్వామ్య మౌలిక సూత్రానికి పూర్తిగా విరుద్ధమైనది. ప్రజా ప్రతినిధులు తాము ప్రజాస్వామ్య విలువలను అప హాస్యం చేస్తూ మొత్తంగా రాజకీయ ప్రక్రియనే నవ్వుల పలు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ లను అధికార పార్టీలోకి ఆహ్వానించే సభలకు ఇచ్చినంత ప్రాధాన్యత రైతులు ఆత్మహత్యలు చేసు కుంటే కనీసం పరామర్సించరా? ఉద్యమ సమయములో జరిగిన ప్రతి ఆత్మహత్యను వాడుకున్న ఈ ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు స్పందించడం లేదు. రైతుల రుణ మాఫీలు చేసామని చేతులు దులుపుకుంటున్నారు కానీ తీవ్ర కరువు పరిస్థితుల వాళ్ళ జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్దయ గా వ్యవహరించడం సమంజసం కాదు. 


తెలంగాణ రాష్ట్రం సిద్దించేవర‌కు గొంగ‌ళి పురుగునైనా ముద్దాడుతాన‌ని చెప్పిన ఉద్య‌మ‌నేత సీఎం అయిన త‌రువాత రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతుంటే  క‌నీసం ప‌రామ‌ర్శించిన దాఖ‌లు లేవు. ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌తి మ‌ర‌ణాన్ని ఉద్య‌మానికి వాడుకునందుకు ఎవ‌రు త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. ఈ రోజు రాష్ట్రంలో క‌రువు విల‌య తాండ‌వం చేస్తున్నా క‌నీసం స్పందించ‌క పోవ‌డం ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వానికి మంచిది కాదు. వ‌ల‌స పాల‌నలో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతే అతి గ‌తి లేదు. అని ఉప‌న్యాసాలు దంచిన ఈ ఉద్య‌మ నాయకులు స్వ‌రాష్ట్ర పాల‌న‌లో రైతులు చ‌నిపోతుంటే స్పందిచ‌డం లేదు. శాశ్వ‌తంగా ఏక పార్టీ పాల‌న‌తో ప‌రిపాలించాల‌ని  క‌ల‌లు గ‌న్న ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు క‌నుమ‌రుగైపోయారు. అందుకే ప్రజా సంక్షేమ‌మే ప్ర‌ధాన ఎజెండా గా గుర్తించి పాల‌క సాగించాలి. అంతేకానీ రాజ‌రీక‌పు వ్య‌వ‌స్థ ను తీసుకువ‌చ్చి నియంత పాల‌న సాగించాల‌నుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: