రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హైడ్రామా నడుస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెసులోనే కొనసాగితే పుట్టగతులు ఉండవని భావించిన కొందరు కాంగ్రెస్ కీలక నేతలు తమకు నచ్చిన పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెసును వీడి బీజేపీలో చేరారు. అయితే ఈ పార్టీలో కూడా భవిష్యత్తు ఉండదని భావించిన ఆయన ఈ నెల 25 న వైసీపీలో చేరుతా అని ప్రకటన విడుదలచేశాడు.


అయితే పార్టీ మారవలసిన రోజే బీపీ ఎక్కువయిందంటూ ఆయన ఆసుపత్రిలో చేరడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ విషయంపైనే టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు పలు సంచలన వాఖ్యలు చేశాడు. తిరుపతిలో టీడీపీ నిర్వహిస్తున్న ధర్మపోరాట సభ యెక్క పనులను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ- రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేకున్నా కాంగ్రెసువారు రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే, హోదా ఇస్తానని మోడీ మాట ఇచ్చి కూడా, హోదా ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఆరోపించాడు.


బీజేపీ వాళ్లను చేర్చుకోవద్దని అమిత్ షా, జగన్ కు ఫోన్ చేసి చెప్పడం వల్లనే వైసీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ చేరిక ఆగిపోయిందని ఆయన విమర్శించారు. కాగా అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను వైసీపి వారు తోసిపుచ్చుతున్నారు. ఒక వేళ ఆయన చేసిన ఆరోపణలు నిజమయితే కర్నూలు జిల్లాలోని కీలకనేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరికను సైతం జగన్ అడ్డుకోవాలి గదా అని తిరిగి ఆయనకు ప్రశ్నవేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: