జగన్ ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు. ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓ విధంగా సంప్రదాయ రాజకీయ వ్యవస్థలకు , ఆలోచనలకు భిన్నంగా జగన్ ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. జగన్ ఆ దిశగా వేస్తున్న ఒక్కో అడుగు ఆయన ఆశయ సిద్ధికి దోహదపడుతోంది.


బీసీ సభ అదరహో :


జగన్ ఆద్వర్యంలో ఏలూర్లో నిర్వహించిన బీసీల గర్జన సభ అధిరింది. ఈ సభకు నేల ఈనిందా అన్నంతగా జనాలు వచ్చారు. ఇక జగన్ సైతం భారీగా వచ్చిన బీసీను మెప్పించెలా మాట్లాడారు. ఓ విధంగా వరాల జల్లులే కురిపించారు. జగన్ తనకు, చంద్రబాబుకు ఉన్న తేడాను కూడా ప్రతి ఒక్క బీసీకి అర్ధం అయ్యేటట్టుగా చెప్పుకొచ్చారు. తాను చెప్పిందే చేస్తానని, చెప్పనిది, చేయలేనిది తన నోట రాదని ఆయన అన్నారు. బీసీలకు మొత్తం బడ్జెట్ లో ఏటా 75 వేల కొట్లతో  పెద్ద మొత్తాన్ని కేటాయించాలనుకోవడం నిజంగా బీసీ గర్జన సభ ఇచ్చిన మేలు  సందేశంగా చెప్పుకోవాలి. ఈ సభతో బీసీలు సైతం ఆలోచనలౌ చేస్తారనుకునేలా సాగింది.


బీసీకి ఎమ్మెల్సీ ;


ఇక జగన్ బీసీ నేత  అయిన జంగా క్రిష్ణ మూర్తికి తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్సీ సీటును కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఇచ్చిన మాట నిలెబెట్టుకుంటున్నామని, రానున్న రోజుల్లో మరింతమందికి అవకాశాలు ఇస్తామని కూడా తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుకు నాలుగు ఎమ్మెల్సీలు వస్తున్నాయని  చెప్పడం విశేషం. మరి ఆయన ఏం చేస్తారో అన్నది చూడమన్నట్లుగా జగన్ బీసీలను కోరారు. మొత్తానికి టీడీపీ తమ ఆస్తిగా బీసీలను వాడుకుంటోందని, బీసీలను తమ ఓటు బ్యాంక్ గా చూస్తోందని భావించిన వైసీపీ వారిని తమ వైపుగా మళ్ళించుకోవడానికి ఏర్పాటు చేసిన బీసీ గర్జన సూపర్ హిట్ కావడంతో టీడీపీ గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి. బీసీ మంత్రుల ఘాటు విమర్శలే ఇందుకు నిదర్శనం.



మరింత సమాచారం తెలుసుకోండి: