టీడీపీ నేతల ఇళ్లపై సీబీఐ, ఈడీ సోదాలు ఇటీవలి కాలంలో కాస్త మందగించాయి. గత ఎన్నికల ముందు టీడీపీ నేతల ఇళ్లపై సీబీఐ, ఈడీ సోదాలు బాగా జరిగాయని ఆ పార్టీ గగ్గోలు పెట్టింది. చంద్రబాబు ఏకంగా ఎన్నికల ప్రచారంలోనే మమ్మల్ని డబ్బులు పంచనీయడం లేదని గోల పెట్టారు.


మొత్తానికి ఎన్నికల్లో టీడీపీ ఆర్థిక మూలాలను బాగానే కట్టి చేయగలిగారని విశ్లేషకులు భావించారు. ఆ తర్వాత జరిగిన కీలక పరిణామాల్లో టీడీపీలోని ఆర్థిక నేరాలు, ఆర్థిక అవకతవకలు ఉన్న నాయకులు ఏకంగా బీజేలీలోకే జంప్ కొట్టారు. ఇలాంటి సమయంలో ఓ టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సోదాలు ఆసక్తి రేపుతున్నాయి.


తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిలో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఆయన ఇప్పటికే బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో జైలులో ఉన్నారు. వాకాటికి చెందిన వియన్నార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ.. IFCIను చీటింగ్ చేసి 190 కోట్ల రూపాయలను రుణం తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. తక్కువ వ్యాల్యూ ఉన్న ఆస్తులను ఎక్కువ విలువ చూపించి IFCI(భారత పారిశ్రామిక ఆర్థిక సంస్థ)ను చీటింగ్ చేసిన కేసులో 2018 జనవరి 21న సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ వాకాటిని అరెస్టు చేశారు.


ఇటీవలే బెయిల్‌ కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకొన్నారు. ఈ సమయంలో బుధవారం తెల్లవారుజామున ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పీఏ రామకృష్ణకు సీబీఐ అధికారులు ఫోన్‌ చేశారు. ఆసమయంలో రామకృష్ణ తిరుమలలో ఉన్నారు. ఆయన్ను ఉన్నపళంగా నెల్లూరు రావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. దీంతో రామకృష్ణ వెంటనే నెల్లూరుకు చేరుకున్నారు.


బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో సీబీఐ అధికారులు వాకాటి నారాయణరెడ్డి ఇంటికి చేరుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ చూపించి సీబీఐకి చెందిన ఇద్దరు సీఐలు, ఇద్దరు బ్యాంకు అధికారులు ఇంట్లోకి ప్రవేశించారు. 3 గంటలపాటు సాగిన సోదాలు జరిపారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: