రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వాళ్లలో సుష్మాస్వరాజ్ ఒకరు.  సుష్మాస్వరాజ్ చదువుకనే రోజుల నుంచే రాయకీయాల్లో మంచి ప్రోత్సాహం ఉండేది.  ఆమె లా చదివేరోజుల్లో స్వరాజ్ పరిచయం అయ్యారు.  అనతికాలంలోనే సుష్మాతో స్నేహం ఏర్పడింది.  ఆ స్నేహం తరువాత ప్రేమగా మారింది.  అయితే, ఇద్దరిలో ప్రేమ ఉన్నప్పటికీ బయటపెట్టలేదు.  



ఎమర్జెన్సీ సమయంలో జార్జి ఫెర్నాండేజ్ కేసును వాదించిన వాళ్లలో సుష్మా, స్వరాజ్ లు ఉన్నారు.  ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.  లా పూర్తయ్యాక ఇద్దరు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేశారు.  రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది.  అయితే, ఇద్దరి ప్రేమను సుష్మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.  అయినా సరే ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.  ఆ తరువాత సుష్మా స్వరాజ్ రాజకీయాల్లోకి రావడం... 25 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.  



మంత్రిగా తన బాధ్యతలను ఎప్పుడు తప్పలేదు.  ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకునే వారు.  ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యేవారు.  అందుకే రాజకీయాల్లో చాలా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు.  ఎక్కడా తగ్గరు.  పార్లమెంట్లో ఆమె మాట్లాడే తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.  సుష్మా అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉన్నది.  ఏ విషయంపైనా అయినా సరే అనర్గళంగా మాట్లాడతారు.  తనకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తి చేసేవరకు ఆమె నిద్రపోదు.  అందుకే ఆమె అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గౌరవం ఉన్నది.  అభిమానం ఉన్నది.  



2019 వరకు రాజకీయాల్లో చలాకీగా ఉన్నారు.  ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019  ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  అది ఆమె నిబద్ధతకు నిదర్శనం.  పోటీ చేస్తే విజయం సాధిస్తుంది.  తప్పకుండా మంత్రి పదవి వస్తుంది.  పదవి వచ్చిన తరువాత తన పనిని తాను నిబద్దతతో చేయాలి.  అలా చేయకుంటే..పదవి అనవసరం.  ఇవన్నీ ఆలోచించే ఆమె ఆ నిర్ణయం తీసుకున్నది.  వీల్ చైర్ మీద కూర్చొని మరి ఇటీవల కాలంలో రాజకీయాలు చేస్తున్నారు.  చివరి క్షణం వరకు పదవుల్లో ఉండాలని కోరుకునే నాయకులు ఈ దేశంలో ఎందరో ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: