కొన్నిసార్లు ఏదో చేయాలని అనుకుంటారు.. కానీ, అది రివర్స్ అవుతుంది.. ప్రాణాల మీదకు తెస్తుంది. అంతేకాదు.. కాళ్ళు విరగ్గొట్టుకునే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే జరిగింది. పాపం ఆ మహిళకు తన భర్త అంటే చాల ఇష్టం. ఇష్టమైన భర్తను కొద్దిగా భయపెట్టాలి అనుకుంది. దానికోసం ప్రత్యేకంగా స్కిన్ టైట్ ఉంటె లాంగ్ సాక్స్ ను కొనుగోలు చేసింది. ఆ సాక్స్ కూడా ఎలా ఉన్నాయో తెలుసా.. అచ్చం పాములా ఉన్నాయి.
చూసిన వ్యక్తులు ఎవరిపైన సరే వాటిని చూసి పాము అనుకోవడం ఖాయం. చీకట్లో తాడును చూసి పాము అనుకున్నట్టుగా అన్నమాట. రాత్రి అయ్యింది. ఆ మహిళా భర్తను భయపెట్టేందుకు సిద్ధం అయ్యింది. వాటిని ధరించి భర్తపక్కన పడుకుంది. నిద్రలో ఉన్న భర్తకు కాళ్ళు తగిలాయి. భర్తకు పాము తగిలిన ఫీలింగ్ కలిగింది. మంచి నిద్రకాస్త వదిలింది. లేచి మెల్లిగా లోపలికి వెళ్లి బేస్ బాల్ బ్యాట్ తీసుకొని వచ్చాడు.
పాము అనుకోని భార్య కాలిపై బలంగా కొట్టాడు. ఆమె కెవ్వుమంది. పాపం పామును చూసి దడుసుకుందని మరలా మరొకటి కొట్టాడు. ఈసారి అరుపు వేరేలా ఉండటంతో.. భర్త షాకయ్యి లైట్ వేశాడు. పాపం భార్య దెబ్బతో విలవిలలాడిపోతుంది. వెంటనే ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా కాలు విరిగినట్టు వైద్యులు చెప్పారు. చేసేది లేక ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించారు భర్త.
భర్తను సర్ప్రైజ్ చేస్తూ భయపెట్టాలి అనుకున్న భార్య దెబ్బలు తగిలి హాస్పిటల్ లో జాయింగ్ కావడం విచిత్రంగా ఉన్నది కదా. ఇంకా నయం పాములాంటి డ్రెస్ మాత్రమే వేసుకుంది. అదే సింహంలాంటి డ్రెస్ వేసుకొని ఉంటె బేస్ బాల్ బ్యాట్ తో ఆమె తలను పగలగొట్టేవాడేమో. కొంతమంది స్పూఫ్ ల పేరులో ప్రాణాలు కూడా పోగుతున్నట్టుకుంటున్నారు. కాబట్టి డేంజర్ గా ఉండే పనుల జోలికి వెళ్లకుండా ఉంటె మంచిది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది జరిగి చాలాకాలం అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.