సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి....టీడీపీలో అదృష్టం లేని సీనియర్ నేత. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి తప్పక పలకరిస్తుంది. వరుసగా గత ఐదు పర్యాయాలు ఓటమి ఆయన వైపే నిలుస్తూ వస్తుంది.  1994, 99లో టీడీపీలో సర్వేపల్లి నుండి గెలిచిన సోమిరెడ్డి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా చేశారు. అయితే ఆ తర్వాత వరుసగా 2004, 09, 14, 19 ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే 2012 కొవ్వూరు ఉపఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఇలా ఎన్నిసార్లు ఓడిపోయిన బాబు మాత్రం...సోమిరెడ్డిని నెత్తిన పెట్టుకుంటూనే ఉన్నారు. 2014లో ఓడిన సోమిరెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చారు.

 

ఇక ఇప్పుడు 2019లో మళ్ళీ ఓడిపోయిన మరొక కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఎప్పుడు మీడియాలో కనిపించే సోమిరెడ్డిని నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా నియమించాలని బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పని చేస్తే జిల్లాలో టీడీపీ కొంచెం ఇబ్బందుల్లో పడే అవకాశముంది. వరుసగా ఇన్నిసార్లు ఓడిపోయిన సోమిరెడ్డిని మిగతా నేతలు లెక్క చేసే అవకాశం లేదు. ఆయన మాట వింటారనేది కూడా కష్టమే.

 

అటు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ అసంతృప్తి బాట పట్టోచ్చు. ఇప్పటికే రవిచంద్ర సోదరుడు బీదా మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కావలిలో పోటీ చేయాల్సిన మస్తాన్ రావు... బాబు వల్ల నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓటమి పాలైన దగ్గర నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం జగన్ సభలో మెరిశారు.

 

దీంతో ఆయన టీడీపీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది ఏదో ఆక్వా రంగానికి సంబంధించి పిలిస్తే వెళ్లారు తప్ప...పార్టీ మారరు అని ఆయన వర్గం వివరణ ఇచ్చిన టీడీపీ శ్రేణులు నమ్మే పరిస్థితిలో లేవు. ఇక ఎలాగో మస్తాన్ రావు పార్టీ మారితే రవిచంద్రా కూడా పార్టీ మారే అవకాశముంది. పైగా తన అధ్యక్ష పదవి సోమిరెడ్డికి ఇస్తే తప్పనిసరిగా టీడీపీకి హ్యాండ్ ఇచ్చేస్తారు. మరి చూడాలి బాబు సోమిరెడ్డి విషయంలో ఎలా ముందుకెళ్తారో.   

మరింత సమాచారం తెలుసుకోండి: