చాలా కాల తర్వాత కేసియార్-జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. వీళ్ళెపుడు సమావేశం అవుతున్నారని వార్తలు వచ్చిన కొందరికి టెన్షన్ పెరిగిపోతుంటుంది. అలాగే ఈసారి కూడా వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతోంది. వీళ్ళ భేటితో టెన్షన్ ఎవరిలో పెరిగిపోతోందో తెలుసా ? ఇంకెవరిలో చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా, బిజెపి నేతల్లో.  నిజానికి వీళ్ళద్దరి భేటి అవుతున్నారంటే అసలు మిగిలిన వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనే చెప్పాలి.

 

ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అందునా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక అంశాలపై భేటి అవుతుంటారు. విభజన చట్టం తాలూకు చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఒకపుడు చంద్రబాబు-కేసియార్ కూడా భేటి అయ్యారు. అప్పుడెప్పుడు జగన్ అసలు పట్టించుకోనే లేదు.  మరి ఇపుడు మాత్రం వీళ్ళకెందుకు టెన్షన్ పెరిగిపోతోంది ? ఇద్దరి వ్యూహాలతో ప్రత్యర్ధులు విలవిల లాడిపోతున్నారు మరి.

 

ఎందుకంటే అసెంబ్లీలో ప్రకటించన మూడు రాజధానుల తర్వాత అంటే రాజధానిని తరలించటానికి ముందు జగన్ కేసియార్ తో భేటి అవుతుండటంతోనే వీళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రాజధాని తరలింపుపై జగన్ కు కేసియార్ ఎటువంటి సలహాలు, సూచనలు  ఇస్తాడో అని వీళ్ళు ఆందోళన పడుతున్నారు.  వీళ్ళద్దరికి కొన్ని కామన్ పాయింట్లున్నాయి.

 

అవేమిటంటే ఇద్దరికీ ఇటు చంద్రబాబు అన్నా అటు బిజెపి అన్నా పడదు. అలాగే వాళ్ళకు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులంటే  ఏమాత్రం గిట్టదు. టిడిపి, బిజెపిలు తెలంగాణాలో కానీ ఏపిలో కానీ కాస్త అటు ఇటుగా ఒకే పరిస్ధితిల్లో ఉన్నాయి.  తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకుపోతే బిజెపికి నలుగురు ఎంపిలున్నారు. ఏపిలో బిజెపికి అసలు ఠికాణానే లేదంటే టిడిపికి 3 ఎంపిలు, 22 మంది ఎంఎల్ఏలున్నారు.

 

ఇద్దరు సిఎంలు కలిసి రెండు రాష్ట్రాల్లో తమను తొక్కేయటానికి ఎటువంటి వ్యూహాలు పన్నుతారో ? అనే టెన్షన్ రెండు పార్టీల నేతల్లో పెరిగిపోతోంది. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా కలుస్తున్న ఇద్దర సిఎంలు ఏ ఏ అంశాలపై మాట్లాడుకుంటారో ? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ? చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: