మామూలుగా అయితే ఒక పెళ్లి చేసుకుంటారు. ఒక పెళ్లి కి మంచి ఇంకో పెళ్లి చేసుకోవాలి అంటే... మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు కోర్టు నుంచి సర్టిఫికెట్ కావాల్సి ఉంటుంది. కోర్టు  నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే కటకటాల పాలు అవ్వాల్సిందే. అంటే మన దేశంలో ఒక పెళ్ళికి మించి  రెండో పెళ్లి చేసుకునే వారు... మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లికి సిద్ధం అవుతారు. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. విడాకులు తీసుకోకున్న సరే  ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోన్న  ఎలాంటి చట్టబద్ధమైన చర్యలు  కూడా ఉండవు. 

 

 

 

 ఏంటి సంబరపడిపోతున్నారా... ఇది మన దేశంలో కాదు లెండి పాకిస్తాన్ లో . అక్కడి సామాజిక పరిస్థితులు ప్రజల జీవన విధానం పై ఇది ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకునే సదుపాయాన్ని అక్కడి రాజ్యాంగం కల్పిస్తోంది. ఈ సదుపాయాన్ని అక్కడ ఓ వ్యాపారి బాగా ఉపయోగించుకున్నాడు. దీంతో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ బంపర్ ఆఫర్ తో తన బిజినెస్ ని అమాంతం పెంచేసుకున్నాడు ఇక్కడ ఓ ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు. పాకిస్తాన్ లో ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు అని ఉన్న సదుపాయాన్ని ఉపయోగించుకుని మార్కెట్ పెంచుకునే చిట్కాలు వాడుకున్నాడు అక్కడి ఓ నూతన కళ్యాణమండపం నిర్వాహకుడు. 

 

 

 ఎలా అంటారా... తన నూతన కల్యాణమండపంలో రెండో పెళ్లి చేసుకుంటున్న వారికి నిర్వహణ వ్యయం 50 శాతం డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించారు. అంతే కాదు మూడో పెళ్లి చేసుకుంటున్న వారికి కళ్యాణ మండపం నిర్వహణలో  75 శాతం డిస్కౌంట్  ప్రకటించిన ఆ నిర్వాహకుడు... నాలుగో పెళ్లి చేసుకునే వారికి కళ్యాణ మండపం పూర్తిగా ఉచితంగా  ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ కళ్యాణ మండపాన్ని బుక్ చేసేది మాత్రం ఆ వ్యక్తి యొక్క భార్య లేదా భార్యలు అయి ఉండాలి అంటూ ఓ కండిషన్ పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: