జనవరి 28వ తేదీన చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. ఒకసారి చరిత్ర లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 లాలాలజపతిరాయ్ జననం : భారతీయ స్వతంత్ర సమరయోధులు అయిన లాలాలజపతిరాయ్ 1865 జనవరి 28వ తేదీన జన్మించారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లలో ఒక్కడిగా లాలాలజపతిరాయ్ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. లాలాలజపతిరాయ్ కి భారతీయులందరూ పంజాబ్ కేసరి అనే బిరుదుతో పిలుచుకుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించాడు. లాలా లజపతిరాయ్... బాలగంగాధర్ తిలక్... బిపిన్ చంద్రపాల్ త్రయం  ఆ  కాలంలో లాల్ బాల్ పాల్ గా ఎంతో ప్రసిద్ధి చెందింది. లాలాలజపతిరాయ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన ఇండియా చరిత్రలోనే ఎంతో ప్రముఖమైనది, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన మరణం లేని అమరవీరుడు లాలాలజపతిరాయ్. 

 

 గిడుగు వేంకట సీతాపతి జననం : సుప్రసిద్ద భాషా పరిశోధకులు విజ్ఞాన సర్వస్వతి  నిర్మాత గిడుగు వెంకట సీతాపతి 1885 జనవరి 28వ తేదీన జన్మించారు. ఆయన పలు గేయాలను  చిన్న పిల్లల కోసం రాసి  బాల సాహిత్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన చిలకమ్మ పెళ్లి అనే గేయం రాశాడు గిడుగు వెంకట సీతాపతి. 

 

 రాజా రామన్న జననం  : భారతదేశ అణు శాస్త్రవేత్త అయిన రాజా రామన్న 1929 జనవరి 28వ తేదీన జన్మించారు. భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంచలన విజయాలు సాధించటం కీలక పాత్ర పోషించారు రాజా రామన్న. భారతదేశం అణు బాంబులు తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. 

 

 పండిత్ జస్రాజ్ జననం : హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడైన పండిట్ జస్రాత్  1930 జనవరి 28వ తేదీన జన్మించారు. శాస్త్రీయ సంగీతం లో ఎంతో ప్రసిద్ధి పొందారు. 

 

 శృతిహాసన్ : విలక్షణ నటుడు కమల్ హాసన్ నట  వారసురాలిగా సినీ పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది . తెలుగు తమిళ కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది శృతిహాసన్. అటు హీరోయిన్ అనే కాదు గాయనిగా కూడా తన సత్తా చాటింది. తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు... గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం సొంతంగ మ్యూజిక్ ఆల్బమ్  ప్రారంభించి సింగర్ గా  అవతారమెత్తింది . కాగా శృతిహాసన్ 1986 జనవరి 28వ తేదీన చెన్నైలో జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: