వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరుగా చరిత్రలో బలమైన ముద్ర వేసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వెన్నుపోటు రాజకీయాలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా తాను నమ్మకం గా ఉంటాడని భావించి కీలక పదవులు అప్పగించిన నేతలు సైతం వెన్నుపోటు రాజకీయాలు నడిపారని విషయం ఆధారాలతో సహా బయటకు రావడంతో ఆ నాయకుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు కీలక నాయకుడుగా  సీనియర్ నాయకుడిగా ఉన్న కళా వెంకట్రావు కు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

 

 అయితే కళా వెంకట్రావు పై టిడిపి నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సొంత నియోజక వర్గాలుగా పేరుపొందిన రాజాం, ఎచ్చెర్ల లలో పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఆ ప్రభావం విజయనగరం లోక్ సభ నియోజకవర్గంపైనా పడింది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ గజపతి రాజు ఓటమికి కళా వెంకట్రావు కృషి చేసినట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం ఎంపీ సీటు గెలవాలంటే రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు అత్యంత కీలకం. 

 

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కళా వెంకట్రావు పార్టీ  ఓటమికి కారణం అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గమైన కాపులను తనవైపు తిప్పుకొని విజయనగరం ఎంపీ స్థానం నుంచి వైసీపీ వైసీపీ తరఫున బరిలోకి దిగిన కాపు వర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్ కు సహకరించి ఆయన గెలుపు కు కృషి చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి సామజిక కోణంలో కళా వెంకటరావు చక్రం తిప్పి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ ఎంపీ కి ఓట్లు వేయించినట్లు ఆయనపై ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. 


ఇప్పటికీ ఆయన వ్యవహార శైలి లో మార్పు రాకపోవడంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఆయన తీరుపై ఆగ్రహం చెందుతున్నారు. అలాగే మొదటి నుంచి కళావెంకట్రావు ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న కింజారపు ఫ్యామిలీకి మధ్య రాజకీయ వైరం ఉంది.ఇక ఇప్పుడు కూడా టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కళా వెంకటరావు కు మధ్య అదే రకమైన వైరం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ని టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు తప్పించి ఆ స్థానంలో అచ్చెన్నాయుడిని తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కళావెంకట్రావు చెక్ పెట్టవచ్చని చంద్రబాబు ఆలోచనగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: