టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక అంశాన్ని పట్టుకుంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టే రకం కాదు. మొండిగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఆ విధంగానే తాను ఏపీ రాజధానిగా నిర్ణయించిన అమరావతిని కాదని ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించడం, విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు ముందుకు వెళ్ళడంతో అమరావతి రైతులు, ప్రజలను తనకు అనుకూలంగా మార్చుకుని ఉద్యమాన్ని లేవదీశారు. మొదట్లో ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇక అమరావతి వివాదం తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతోంది అనుకుంటున్న సమయంలో అధికార వైసిపి పార్టీ ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.


 అప్పటి వరకు జగన్ నిర్న్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన బీజేపీని ఈ విషయంలో ఒప్పించగలిగింది. ఆ పార్టీని ఒప్పించడంతో జనసేన పార్టీ కూడా వెనక్కి తగ్గింది. దీంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నట్లుగా అధికార పార్టీ ప్రజలను రెచ్చగొట్టి సక్సెస్ అయింది. దీంతో ఈ ఉద్యమం కారణంగా తెలుగుదేశానికి కలిసి వచ్చేదికంటే నష్టం ఎక్కువగా ఉన్నట్టు గా తయారైంది. ఈ లోపు టిడిపి అధినేత చంద్రబాబు పీఏ పై ఐటీ దాడులు జరగడం, టిడిపి నాయకుల అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా మీడియాతో పాటు జనాలు కూడా మర్చి పోయారు. 


ఇక అమరావతి లో టీడీపీ చేస్తున్న ఉద్యమం పై ఎవరు చర్చలు కూడా చేయడం లేదు. ఈ విషయంలో అధికార పార్టీ వైసీపీ బాగానే సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.ఇప్పుడు అమరావతి ఇష్యుని హైలెట్ చేద్దామని టిడిపి ప్రయత్నం చేసినా అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు టిడిపిని ఒక్కో వివాదం చుట్టుముట్టేస్తున్నాయి వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం కూడా అన్ని రకాలుగా సహకరిస్తూ ఉండడంతో చంద్రబాబును కానీ, ఆ పార్టీ చేపట్టే ఉద్యమాలను కానీ పట్టించుకునే వారే కరువయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: