ముఖేష్ అంబానీ.. ఈ దేశంలోనే అత్యధిక ధనవంతుడు. ప్రపంచ కుబేరుల్లో ఒకడు. ఆయన ఆస్తి కనీసం ఓ పెద్ద రాష్ట్రం బడ్జెట్ కు రెండు రెట్లు.. ఆయన ఓ గంట సంపాదన ఏకంగా ఏడు కోట్లు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు స్వయంగా ఏపీ సీఎం జగన్ ను ఇంటికొచ్చి మరీ కలిశాడు. అయితే ఓ పారిశ్రామిక వేత్త ఓ సీఎంను కలవడం సాధారణంగా పెద్ద విషయం కాదు. ఇలాంటి భేటీలు చాలా జరుగుతూనే ఉంటాయి.

 

 

ఇంతకీ జగన్ ను ముఖేష్ కలవడానికి అసలైన కారణం అంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఓ వ్యక్తి కోసం అంబానీ జగన్ ను కలిశాడట. ఇంతకీ అతను ఎవరు.. అతనికి అంత ప్రాధాన్యం ఏంటి.. ఓసారి చూద్దాం.. ఆ వ్యక్తి పేరు.. పరిమళ్ నత్వానీ.. ఈ నత్వానీ ఏపీ కోటాలో త్వరలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ నత్వానీ మొదట్లో వ్యాపారి... 1997లో రిలయెన్స్‌లో జాయినయ్యాడు.. రిలయెన్స్ వ్యాపార విస్తరణలో ఇతనిది కీలక పాత్ర. ధీరూభాయ్ అంబానీకి ఈ నత్వానీ సన్నిహితుడు. రిలయెన్స్ టెలికాం , పెట్రో కీలక ప్రాజెక్టుల అభివృద్ధిలో నత్వానీ వ్యూహం ఉందట.

 

 

అంతే కాదు.. ఈ నత్వానీ బీజేపీకి సన్నిహితుడు. 2008లో జార్ఖండ్ నుంచి తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యాడు.. తర్వాత 2014లోనూ బీజేపీ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు మరోసారి ఎంపీ ఛాన్స్ కోసం ఏపీ వైపు చూస్తున్నాడు. మొన్న జగన్ అమిత్ షాతో కలిసినప్పుడు ఏపీ నుంచి బీజేపీకి ఓ ఎంపీ సీటు కేటాయించాలని డీల్ కుదిరినట్టు సమాచారం. ఆ ఒక్క సీట్ ఈ నత్వానీ కోసమేనట. ఇప్పుడు జగన్ ఈ నత్వానీని వైసీపీ నుంచి ఎంపీ సీటుకు పంపబోతున్నాడట.

 

 

ఈ విషయం కోసమే ఏకంగా ముఖేశ్ అంబానీ నేరుగా జగన్ వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన కంపెనీల విస్తరణ వ్యవహారాలు ఎలా ఉన్నా.. జగన్ అంబానీ భేటీలో ఇదే కీలకమైన విషయం అని తెలుస్తోంది. అదే నిజమైతే.. జగన్ బీజేపీకి మరింత దగ్గరైనట్టే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: