ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కొనసాగుతున్న వైసిపి ప్రతిపక్షంలో ఉన్నా టిడిపి పార్టీలు మెయిన్ లీడ్ లో ఉన్న విషయం తెలిసిందే. అంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వైసీపీ సర్కార్ కు భారీ మెజారిటీ కట్టబెట్టి ఘన విజయాన్ని సొంతం చేశారు ఆంధ్ర ప్రజలు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలను సంతృప్తి పరిచేలా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు.. ఇక అమరావతి ప్రజలు మినహా మిగతా ప్రజలందరూ జగన్ పాలన తో కాస్త సంతృప్తిగానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ జగన్ సర్కార్ కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి.. ప్రజల్లో ఈ ఐదు సంవత్సరాలలో వ్యతిరేకతను మూటగట్టుకుంటే..  ప్రజలు గెలిపించుకోవడానికి ప్రత్యామ్నాయ పార్టీ ఏదని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై వ్యతిరేకతతో ఆంధ్ర రాజకీయాల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారు. 

 

 మరి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు  వ్యతిరేకత వస్తే వేరే ప్రభుత్వం కావాలని కోరుకుంటే ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ ఏది అంటే.. ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మారుద్దామని జనసేన పార్టీని స్థాపించి ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాట లేక ప్రస్తుతం బీజేపీతో కొనసాగుతున్నారు. బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆంధ్ర రాజకీయాల్లో మాత్రం సత్తా చాటలేకపోతుంది. అయితే ఒకవేళ ఆంధ్ర ప్రజలు టిడిపి వైసిపి పార్టీలను కాదని వేరే ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపాలి అంటే.. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ప్రత్యామ్నాయ పార్టీ లేదు. బిజెపి జనసేన పార్టీలు ఉన్నప్పటికీ అవి కూడా.. అధికార పక్షంపై టిడిపి పార్టీ ఏం విమర్శలు చేస్తుందో  ఆ పద్ధతిని ఫాలో అవుతూ ఆ విమర్శలను చేస్తున్నారు. 

 


 ఇలా కాకుండా జనసేన బిజెపి పార్టీలు ఒక ప్రత్యేక ప్రణాళికతో.. ఓ వైపు టిడిపి పార్టీ తప్పిదాలను మరోవైపు అధికార వైసిపి పార్టీ తప్పిదాలను ఎండగడుతూ ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడినప్పుడు మాత్రమే ప్రజల్లో వారికి ఆదరణ దక్కుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా కాకుండా టీడీపీ చేస్తున్న విమర్శలను తాము కూడా చేస్తూ టిడిపి పార్టీక తోకల వ్యవహరిస్తే  ప్రజల్లో ఆదరణ కరువవుతోంది అని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలప్పటికీ ఒకవేళ ప్రజలు ప్రత్యామ్నాయంగా కావాలి అనుకుంటే బిజెపి జనసేన పార్టీ ఎదగడానికి.. ప్రజల నమ్మకాన్ని పెంచడానికి ప్రత్యేక  ప్రణాళికలు వ్యూహాలు సిద్ధం చేసుకుని  ముందుకు సాగాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: