కరోనా.. ఈ పేరు కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరి నోట నానుతూనే ఉంది.  ఉదంయ లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకు ఒక్కసారైనా ఈ కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ కరోనా గురించి చర్చించుకుంటున్నారు.  చైనాలో మొదలైన ఈ దిక్కమాలిన వైరస్ ఇప్పుడు వివిధ దేశాల్లో వ్యాపించింది.  ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ వేసుకొని తిరిగే పరిస్థితి నెలకొంది.  అయితే కరోనా వల్ల మరణాలు ఎక్కువగా చైనా, ఇరాన్ లో జరిగాయి. 

 

చైనా తర్వాత ఈ కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందింది ఇరాన్ దేశంలో.  అయితే కరోనా కన్నా మరో భయంకరమైన వ్యాధి మానసిక వ్యాధి.  ఎవరు ఏది చెప్పినా చేసి తర్వాత ఇబ్బందుల్లో పడటం మానవ సహజం.  ఇలాంటి బలహీనతలు క్యాష్ చేసుకోవడానికి కొంత మంది కేటుగాళ్ళు లేని పోని వదంతులు పుట్టిస్తూ.. కరోనాను దగ్గరకు రాకుండా మందులు ఇస్తామని మాయమాటలు చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఇక మాస్కుల విషయానికి వస్తే బంగారంగా మారిపోయాయి.  తాజాగా కరోనా వైరస్ పై  సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మి 27మంది ప్రాణాలు పోగొట్టున్నారు. చైనా తరువాత కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న దేశం ఇరాన్.

 

ఇరాన్ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం  7,161మందికి వైరస్  సోకగా అందులో 2394మందికి వైరస్ తగ్గినట్లు ప్రకటించింది.  తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మిన ఇరాన్ దేశంలో కొంత అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  కరోనాను అరికట్టాలంటే.. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే నాటు సారా తాగితే బెటర్ అని వదంతులు వచ్చాయి. దాంతో రాన్ దేశ వ్యాప్తంగా నాటు సారా తాగి 217మంది ఆస్పత్రి పాలయ్యారు. అందులో 27మంది మృతి చెందారు.  మరికొంత మంత్రి తీవ్ర అస్వస్థతో ఆసుపత్రుల్లో చేరారు. దాంతో ఇలాంటి వదంతులు నమ్మోద్దు అని డాక్లర్లు దేశ ప్రజలకు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: