ఏపీలో స్థానిక ఎన్నికల సమరం సాగుతోంది. ఈ యుద్ధంలో పూర్తిగా వైసీపీదే పైచేయిగా ఉంది. అసలు కొన్ని జిల్లాల్లో టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారు.సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీదే హవా నడుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు టీడీపీ పూర్తిగా నిరాశలో ఉండిపోయింది. అందులోనూ అసలు ఈ ఎన్నికలు జరగకుండా చూసేందుకు చాలా ప్రయత్నించింది. చివరకు కరోనాను కూడా సాకుగా చూపించి ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీని కోరింది.

 

 

కానీ చివరకు బరిలో దిగాల్సి వచ్చింది. ఇక ఇలాంటి సమయంలో వైసీపీ నాయకుల ఓవర్ యాక్షన్ టీడీపీకి, దాని అనుకూల మీడియాకు వరంగా మారుతోంది. ఎలాగూ ఓడిపోయే ఎన్నికలే కాబట్టి టీడీపీ ముందు నుంచే సాకులు రెడీ చేసి పెట్టుకుంటున్నట్టుగా ఉంటున్నాయి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలు. దీనికి తోడు వైసీపీ నేతలు పలు చోట్ల చేస్తున్న దాడులు టీడీపీకి వరంగా మారుతున్నాయి. తాను తానా అంటే తందానా అనే అనుకూల మీడియా ఉండటంతో వైసీపీ నేతల దాడులపై విపరీతమైన ప్రచారం సాగిస్తున్నారు.

 

 

 

వైసీపీ నేతలు మాచర్ల వంటి ప్రదేశాల్లో చేస్తున్న దాడులను ఎవరూ సమర్థించలేరు. ఇలాంటి వాటిని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఖండించాల్సిందే. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందే. అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఈ దాడులను గ్లోరిఫై చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగు దేశం హయాంలో ఇంత కు మించి దాడులు జరిగాయని.. అప్పుడు ఇదే మీడియా లైట్ గా తీసుకుందని గుర్తు చేస్తున్నాయి.

 

 

అసలే జగన్ సర్కారుపై గుర్రుగా తెలుగు దేశం అనుకూల మీడియా ఇప్పుడు ఈ ఘటనతో మరింతగా రెచ్చిపోతోంది. పదే పదే అవే దృశ్యాలు చూపిస్తూ ఏపీలో అరాచకం జరిగిపోతోందన్న ఫీలింగ్ వచ్చేలా కుమ్మేస్తోంది. జగన్ ఎక్కడ తప్పు చేస్తాడా.. ఎప్పుడు కుమ్మేద్దామా అని ఆత్రంగా ఉన్న తెలుగు దేశం అనుకూల మీడియా స్థానిక ఎన్నికల గొడవలతో పండుగ చేసుకుంటోంది. ఇదిగో ఏపీ మరో బీహార్ అవుతోంది చూశారా అంటూ.. చిత్రీకరిస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ తగినంత జాగ్రత్తగా లేకపోతే.. తెలుగుదేశం అనుకూల మీడియా మరింతగా రెచ్చిపోవడం ఖాయం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: