ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ విషయమై శనివారం ఆయన సమక్షంలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.43 కోట్ల ఇళ్లకు, ఇప్పటికే 1.37 కోట్ల ఇళ్లల్లో సర్వే విజయవంతంగా పూర్తయిందన్నారు. ఇలాంటి సర్వే మరే రాష్ట్రంలోనూ జరగలేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టిందని చెప్పారు.

 

ఇక్కడ ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంలు ఉన్నారని.. అలాగే ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ ఉన్నారని ఈ సందర్భంగా అయన చెప్పారు. ఇక దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఏపీలో ఇంటింటి సర్వే చేసినట్లు విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి వలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇందుకోసం 2.80 లక్షల మంది వలంటీర్లు, 1.18 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు వర్క్ చేస్తున్నారని ఆయన చెప్పారు. 

 

విదేశాల నుంచి రాష్ట్రానికి 6,379 మంది వచ్చినట్లు కేంద్రం జాబితా విడుదల చేస్తే, వలంటీర్లు, ఆశా వర్కర్ల సర్వేలో మరో 6 వేల మంది విదేశాల నుంచి వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని... విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు రాష్ట్రం మొత్తం కట్టుబడి ఉందని, ఆ రకంగా రాష్ట్రం మొత్తం సర్వ సిద్ధంగా ఉందని... విజయ్ కుమార్ వెల్లడించారు. 

 

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు బయటకు వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ విషయం పట్ల రాష్ట్ర ప్రజలు పక్కాగా ఉండాలని, యెంత మాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదని ఈ సందర్భంగా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: