చంద్రబాబు ఏపీపై పట్టు కోల్పోతున్నారు. 2019 ఎన్నికల ఓటమి దెబ్బకు ఒక్కో జిల్లాలో టీడీపీ ఖతం అవుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకొని జిల్లాల్లో టీడీపీ పట్టు కోల్పోయింది. మొన్న ఎన్నికల్లో కడప,కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాని విషయం తెలిసిందే. అయితే ఆ నాలుగు జిల్లాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్ల, ఫుల్ డామినేషన్ వైసీపీది అయిపోయింది. ఒకవేళ భవిష్యత్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన, ఈ జిల్లాల్లో మాత్రం వైసీపీ హవానే కొనసాగే అవకాశముంది.

 

ఇక ఈ నాలుగు జిల్లాల సరసన ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కూడా కలిసింది. ఈ జిల్లాలో ఎలాగో టీడీపీ ఒకే సీటు గెలుచుకుంది. కుప్పం నుంచి చంద్రబాబు ఒక్కరే గెలిచారు. మిగతా 13 సీట్లు, రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. సరే ఓటమి తర్వాత అయిన టీడీపీ పరిస్తితి మెరుగైందా? అంటే అస్సలు లేదనే చెప్పాలి. ఉన్నకొద్దీ చిత్తూరులో టీడీపీ పరిస్తితి దిగజారుతూ వస్తోంది.  

 

ఓడిపోయిన నేతలు నిదానంగా టీడీపీకి దూరమైపోతున్నారు. నాలుగైదు నియోజకవర్గాల్లో తప్ప, మిగతా చోట్ల టీడీపీ అడ్రెస్ లేదు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒక్కరే కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే కొందరు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో ఉంటే కష్టమని భావిస్తున్నారు. టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని, వైసీపీలోకి వెళితే బెటర్ అని ఆలోచిస్తున్నారు.

 

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎల్ లలితకుమారి టీడీపీని వీడారు. ఈమె దాదాపు 27 ఏళ్ల నుంచి టీడీపీలో ఉంటున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో పూతలపట్టు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈమె వెనుకే మరికొందరు చిత్తూరు నేతలు కూడా టీడీపీని వీడి, వైసీపీలోకి వెళ్ళే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే బాబు...చిత్తూరు జిల్లాని కూడా జగన్‌కు అప్పగించేసినట్లే కనబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: