కరోనా.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. అయితే ఈ వైరస్ చైనీయుల మాంసాహార అలవాట్ల వల్లే వచ్చిందన్న వాదనలు మొదట్లో బలంగా వ్యాపించాయి. చైనీయులు గబ్బిలాలతో సహా ఏ జంతువునూ వదలరని అంటారు. అంతే కాక కరోనా వైరస్ మొదట వచ్చిన వుహాన్ నగరంలో అతిపెద్ద మాంసం మార్కెట్ ఉంది. ఇక్కడ దొరకని జంతు మాంసం అంటూ ఉండదు.

 

 

అందుకే చైనీయుల ఆహారపు అలవాట్లపై ప్రపంచమంతా నెగిటివ్ కథనాలు వచ్చాయి. అంతే కాదు.. ఏబ్రాసి ఎదవల్లారా ఎవడైనా గబ్బిలాలు తింటార్రా అంటూ ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడితో అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. అయితే దీన్ని చైనా ఖండించింది. కానీ.. విచిత్రం ఏంటంటే..ఇంత జరిగినా ఇప్పటికీ చైనాలో అదే తరహా మాంసాహార మార్కెట్లు కొనసాగుతున్నాయి.

 

 

వాస్తవానికి వూహాన్‌ మార్కెట్‌ ఒక్కటే కాదు. వేల సంఖ్యలో చిన్న చిన్న మాంసం మార్కెట్లు చాలా ఉన్నాయి. చైనాలో ఇదో భారీ పరిశ్రమ. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు ఆ దేశంలో దాదాపు 20,000 ఫామ్‌లు ఉన్నాయి. కరోనా విజంభణ తర్వాత వీటిని మూసేశారు.

 

 

అయితే ఇప్పటికీ ఈ మార్కెట్లు కొన్ని కొనసాగుతూనే ఉన్నాయట. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలం అవుతున్నా.. ఇప్పటికీ అక్కడ ఆన్‌లైన్‌లో అనేక రకాల వన్యజీవుల మాంసం విక్రయాలు పెరిగాయట. ఇప్పుడు ఈ మార్కెట్లకు సంబంధించిన చిత్రాలు అనేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత జరిగినా చైనావాళ్ల ఆహారం అలవాట్లు మారలేదని విమర్శలు వస్తున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: