తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తొలి కరోనా మరణం నమోదైంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సిన సమయం రానే వచ్చింది. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదైనప్పటికీ వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తొలి కరోనా మరణం నమోదు కావడంతో ప్రజలు కరోనా సోకకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
హైదరబాద్ లోని ఖైరతాబాద్ లో కరోనా లక్షణాలతో 74 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. గత కొంతకాలంగా కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వృద్ధుడు కొన్నిరోజులు సైఫాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. నిన్న రాత్రి శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. ఈ పరీక్షలలో వృద్ధుడు కరోనా భారీన పడి చనిపోయినట్లు తేలింది. 
 
మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య 65కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, తొలి మరణం నమోదు కావడంతో ఇప్పటివరకూ కొంత నిర్లక్ష్యం వహించిన వారు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఒకరికి కరోనా సోకినా కుటుంబ సభ్యులందరికీ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 
 
కరోనా వైరస్ భారీన పడితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు పూర్తిగా ఇంటికే పరిమితం కావడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు పాటించి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి చేజారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 14కు చేరింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వ సూచనలతో పాటు ముందుజాగ్రత్త చర్యలు పాటిస్తే కరోనా నుండి రక్షించుకోవచ్చు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: