తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటివరకూ 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాని లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజలు, దినసరి కూలీలు పలు ప్రాంతాలలో ఆకలి బాధలతో అలమటిస్తున్న విషయం తెలిసిందే. 
 
పేద ప్రజల ఆకలి బాధలు తెలుసుకొని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం గోషా మహల్ లో ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచితంగా భోజనం అందించేలా చర్యలు చేపట్టారు. పేదల కోసం భోజనం వండించి వాటిని ప్యాకెట్ల రూపంలో పంచుతున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై వలస కూలీలు, నిరాశ్రయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రతిరోజూ ఉచిత భోజనం అందిస్తూ రాజాసింగ్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్నం, రాత్రి పేద ప్రజలకు ఉచిత భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ఉచిత భోజనం పంపిణీ గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వంతు సాయం చేస్తున్నానని చెప్పారు. వెయ్యి మందికి మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నామని... చాలా మంది ఆకలితో అలమంటించేవారికి భోజనం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈరోజు ఆదివారం అయినప్పటికీ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించామని అన్నారు. రేషన్ షాపుల్లో లబ్ధిదారులందరికీ బియ్యం పంపిణీ జరిగితే ఆకలితో అలమటించే వారి సంఖ్య తగ్గుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని కోరారు. కేసీఆర్ హైదరాబాద్ నగరంలో భోజనం కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి ఆలోచించాలని కోరారు. ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: