ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండగా... పోలీసులు మండే ఎండల్లో నిలబడుతూ ప్రజల్ని రోడ్ల మీదకు రాకుండా పర్యవేక్షిస్తూ 24x7 అనగా నిర్విరామంగా తమ విధులని నిర్వహిస్తున్నారు. ఒక్కసారి ఊహించుకుంటే ఈ లాక్ డౌన్ డ్యూటీ ఎంత క్లిష్టతరమైనదో తెలుస్తుంది. అందుకే కేవలం వయసులో ఉన్నవారు మాత్రమే లాక్ డౌన్ డ్యూటీ ని చేయగలుగుతున్నారు అని... కానీ వయసు పై బడిన పోలీసులకు ఈ కష్టమైన లాక్ డౌన్ డ్యూటీ చాలా కష్టతరంగా ఉందని... వారిని లాక్ డౌన్ విధుల నుండి మినహాయించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ని కోరగా... హోంమంత్రి మేకతోటి సుచరిత ఓకే చెప్పేసారు. 55 ఏళ్లు దాటిన కానిస్టేబుల్స్ లతో పాటు డయాబెటిస్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి లాంటి అనారోగ్య సమస్యలు ఉన్న పోలీసులు కూడా లాక్ డౌన్ విధులను నిర్వహించక్కర్లేదని ఆమె ఆదేశించారు.



ఐతే జనరల్ గౌతమ్ సవాంగ్ ఈ ఆదేశాలను వెంటనే అమలులోకి తెస్తామని తెలిపారు. 55 ఏళ్లు, 55 ఏళ్లు దాటిన పోలీసులకు లాక్ డౌన్ డ్యూటీల నుండి తొలగించి వారికి ఏ రకమైన ఫీల్డ్ డ్యూటీ కాకుండా ఆఫీసు వర్క్, పోలీసు స్టేషన్‌ లలోనే విధులు నిర్వహించేలా చేస్తామని ఆయన వెల్లడించారు. కంట్రోల్ రూమ్ లలో మొత్తం వయసు పైబడిన వారే విధులు నిర్వహిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొన్ని రోజుల క్రితం వయసు పైబడినా కానిస్టేబుళ్లంతా లాక్ డౌన్ డ్యూటీ చేయలేకపోతున్నామని తనకి తెలియజేశారని... ఆ విషయాన్ని తాను ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వచ్చానని... హోంమంత్రి మేకతోటి సుచరిత తన ప్రతిపాదనలను ఆమోదించారని ఆయన తెలియజేశారు.


ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో మండే ఎండల్లో డ్యూటీ లు చేస్తున్నా కానిస్టేబుళ్లకు కొన్ని ట్రస్ట్ లు పెరుగు భోజనంతో పాటు చల్లటి త్రాగు నీటిని అందజేస్తున్నారు. ఏదేమైనా ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడటం పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: