ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుంటే... మరోవైపు కొంతమంది పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ అందరి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. తబ్లీజీ మత సమ్మేళనంలో పాల్గొన్న వారి కారణంగా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే విధంగా పెరిగిపోతుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ తప్పకుండా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తీనోరు మొత్తుకుంటున్నా ప్రజల మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.


తాజాగా కృష్ణాజిల్లా తోట్లవల్లూరులో జరిగిన ఓ సంఘటన అందరిని విస్తుపోయేలా చేస్తోంది. గురువారం నాడు కృష్ణాజిల్లా తోట్లవల్లూరులోని బంగ్లా తోటలో నిర్వహించిన పేకాట శిబిరంలో పేకాట ఆడుతూ గస్తీ కాస్తున్న పోలీసులకు ముగ్గురు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు 1850 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే కుమ్మమూరు వద్ద ముద్దులవానిగూడెంలో ఇంకొక పేకాట శిబిరం లో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 2130 రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. నరేంద్ర మోడీ తో సహా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ఇంటికే పరిమితం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటే... వీరు మాత్రం లాక్ డౌన్ నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తూ పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.


ఒకవేళ పేకాట శిబిరంలో ఎవరికైనా కరోనా వైరస్ సోకితే... అది అందరికీ వ్యాపించే ప్రమాదముంది. ఈ ప్రమాదమును ముందస్తుగానే గుర్తించకుండా భారతదేశంలో వందల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడిన సంఘటనలు కోకొల్లలు. ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేయకపోతే మన భారత దేశ ప్రజలు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. అసలే మన భారతదేశంలో వైద్య సదుపాయాలు, మందులు అతి తక్కువ సంఖ్యలో లభిస్తుంటాయి. అమెరికా ఇటలీ దేశాల్లో లాగా ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తే... మన దేశం స్మశాన వాటిక గా మారుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: