ఎప్పుడు ఏదో అంశంతో నో , ఏదో ఒక వివాదం లోనో, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వార్తల్లో ఉంటుంది వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి జగన్ కు చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నారు. వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీ టీడీపీని ఎదుర్కోవడంలో రోజా ముందుండేవారు.ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు జగన్ క్యాబినెట్ లో సముచిత స్థానం లభిస్తుందని అందరూ అంచనా వేయగా, జగన్ మాత్రం మొండిచేయి చూపించారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురి అవడంతో ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇక త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రోజా కు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఆమె ఉన్నారు.
 
 
 
 ఇది ఇలా ఉండగా నగరి నియోజకవర్గంలో రోజాకు పెద్ద చిక్కొచ్చిపడింది. జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి నారాయణ స్వామి తరచుగా నగరి నియోజకవర్గంలో ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నించడం, గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ ఉండడంతో రోజా చాలా కాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయమై జగన్ దగ్గర పంచాయతీ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగానే నగరి మున్సిపల్ అధికారి మాట్లాడిన సెల్ఫీ వీడియో వివాదాస్పదమైంది. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్ అయింది. కరోనా కు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ పేర్కొంటూనే... నగరి ఎమ్మెల్యే రోజా చాలా సమర్ధవంతంగా పని చేస్తున్నారని, ఆమె సొంతంగా తన ఖర్చులతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారని రోజా గురించి అదే పనిగా పొగుడుతూ... అదే సమయంలో ప్రభుత్వ తీరుపై సదరు అధికారి విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి సదరు అధికారి వెంకట్రామిరెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసింది.
 
 
 
 అయితే ఆ అధికారి ఆ విధంగా మాట్లాడటం వెనుక రోజా ఉన్నట్లు వైసీపీలోనే ఆమె వ్యతిరేక వర్గీయులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిధులు కేటాయించక పోయినా, రోజా తన సొంత నిధులను ఖర్చు పెడుతూ, ఆదర్శంగా నిలుస్తున్నారు అని ప్రచారం చేయించుకునేందుకు ఆమె ఈ విధంగా సదరు అధికారి తో  మాట్లాడించి  నట్టుగా  వైసీపీలో నే ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కూడా వైసిపి పెద్దల దృష్టికి వెళ్లడంతో దీనిపై అంతర్గతంగా వారు విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: