ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని క‌మ్మేసి ఎంతోమందిని చంపేస్తోన్న క‌రోనా వైర‌స్ గురించి ఇప్పుడు మ‌రో గుండె బ‌ద్ద‌ల‌య్యే విష‌యం తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా ఎలా వ‌స్తుంద‌న్న అంశంపై చాలా సందేహాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలిసిన నిజంతో ప్ర‌తి ఒక్క‌రి గుండె  బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే. క‌రోనా వైర‌స్ రోగుల నుంచి ఈ వైర‌స్ 13 అడుగుల వ‌ర‌కు వ్యాపిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.అయితే, గాలి ద్వారా వచ్చే వైరస్ 13 అడుగుల దూరంలో ఉన్న వారికి సోకే అవ‌కాశాలు త‌క్క‌వ‌ని చైనాలోని బీజింగ్ కు చెందిన‌ అకాడమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్‌ సైన్సె్‌స్‌కు ప‌రిశోధ‌కులు అంటోన్నారు.

 

తాజా ప‌రిశోధ‌న‌ల్లో వైర‌స్ 13 అడుగులు లేదా 4 మీట‌ర్ల వ‌ర‌కు గాలితో తేలుతూ ప్ర‌యాణిస్తుంద‌ట‌. అంటే దీనిని బ‌ట్టి సోష‌ల్ డిస్టెన్స్ అంటే 13 అడుగుల దూరంలో నిల‌బ‌డాల‌న్న‌మాట‌. అంటే ఎవరైనా దగ్గినా, తుమ్మినా... తుంపర్లు వ‌స్తే.. గాలిలో ఎగురుతూ వెళ్తాయి. గాలి లేక‌పోతే తుంప‌ర్లు అక్క‌డే ప‌డ‌తాయి. ఇక క‌రోనా రోగి చుట్టుప‌క్క‌ల కూడా ఈ వైర‌స్ ఎక్కువుగా ఉంటుంది. అంటే క‌రోనా రోగి ఉన్న బెడ్ రాడ్ల‌కు, త‌లుపు గ‌డియ‌పై కూడా వైర‌స్ ఎక్కువుగా ఉంటుంద‌ట‌. ఐసీయూ సిబ్బంది బూట్లపై కరోనా వైరస్ ఉండ‌టం గ‌మ‌నించారు. కనీసం 8 అడుగుల సోషల్ డిస్టాన్స్ అవ‌స‌ర‌మంటున్నారు. దగ్గగగా ఉంటే కరోనా సోకే ప్రమాదం ఎక్కువ అని చైనా ప‌రిశోథ‌కులు తేల్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: