క‌రోనా దెబ్బ‌కు కుదేలైన పారిశ్రామిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి నుంచే ఆలోచ‌న‌లు చేస్తోంది. లాక్‌డౌన్ ముగియ‌గానే కొన్ని వేగ‌వంత‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకోవాల‌ని భావిస్తోంది. దేశీయ అవ‌స‌రాలు, ఉత్ప‌త్తి రెట్టింపు, లేబ‌ర్ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం, పారిశ్రామిక రంగంలోని న‌ష్టాల కూర్పు వంటి అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకువ‌చ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం షిఫ్టుకి 8 గంటల పని విధానం అమల్లో ఉంది. దీన్ని 12 గంటల వరకూ పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు క‌ల్పించేలా  కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ త్వరలో తేబోతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 ఇప్పటివరకూ ఆ ఆర్డినెన్స్ జారీ కాలేదు. బడ్జెట్ సమావేశాల్లో దాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనుకున్నా... సమయం లేక అది వెనక్కి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు నెల‌కొన్న పరిస్థితుల్లో ఈ ఆర్డినెన్స్‌ను త‌ప్ప‌క కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకువ‌స్తుంద‌ని కొంత‌మంది ఎంపీలు కూడా అంగీక‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా  దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా... లేబర్ కొర‌త పెరిగింది. లేబ‌ర్ కొరత‌ను తీర్చ‌డానికి  అవ‌కాశాలు త‌క్కువ‌. అందుబాటులో ఉన్న మ్యాన్ ప‌వ‌ర్‌తోనే ఎక్కువ స‌మ‌యం ప‌నిచేయించుకోవ‌డ మొక్క‌టే ఈ సమస్యకు ప‌రిష్కార మార్గంగ క‌న‌బ‌డుతున్న‌ట్లు పారిశ్రామికవ‌ర్గాలు కేంద్ర ప్ర‌భుత్వానికి సూచ‌న చేస్తున్న‌ట్లు ఎకనామిక్ టైమ్స్ ప్ర‌చురించిన క‌థ‌నం సారాంశం.


 పారిశ్రామిక వేత్త‌లు కోణంలో ఆలోచిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం షిప్టును 12 గంటలపాటూ కొన‌సాగిస్తే ఎలా ఉంటుంద‌న్న దానిపై కొంత‌మంది నిపుణుల‌చే నివేదిక త‌యారు చేయించే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ తరువాత లాక్‌డౌన్ ఎత్తేసినా... కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ తరువాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై అనేక రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకుంటుండటం గ‌మ‌నార్హం. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: