దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేతు అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  నరేంద్ర మోదీ... దేశ ప్రజలందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఆరోగ్య సేతు (Aarogya Setu) మొబైల్ యాప్‌ని కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా, అసలు అవి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపు సత్ఫలితాలిస్తోందని నీతి ఆయోగ్ టీమ్ వెల్లడించింది.

 

మోదీ పిలుపునిచ్చిన గంటల్లోనే కోటీ పది లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా చేసుకుంటున్నారు. 13 రోజుల్లో ఈ యాప్‌‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ల నుంచి 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.  14వ తేదీ ఉదయం పది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నిమిషానికి లక్షమంది చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, సగటున నిమిషానికి 20 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని నీతి ఆయోగ్ బృందంలోని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరక్టర్ అర్నబ్ కుమార్ తెలిపారు.

 

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అభివృద్ధి చేసిన ఈ యాప్ ఇంగ్లీష్‌తో పాటు 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. మీ పరిసరాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి కదలాడితే వెంటనే మీకు అలర్ట్‌ వస్తుంది. ఇందుకు 20 సెకన్లు కేటాయిస్తే చాలు. కరోనా లక్షణాలు ఉన్నాయని తేలితే వెంటనే ప్రభుత్వ సర్వర్‌కు సమాచారం వెళ్లిపోతుంది. దీని ఆధారంగా అధికార యంత్రాంగం సదరు వ్యక్తి లొకేషన్‌ను గుర్తించి, అతడిని ఐసొలేషన్‌ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: