దేశంలో కరోనా మహమ్మారి చొరబడ్డనాటి నుంచి మనిషికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  ఇప్పటికే దేశంలో పదివేలు దాటి.. పదిహేను వేల దిశగా కేసుల సంఖ్య పెరిగిపోతుంది.  శంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 14,378కి చేరగా, ఇప్పటివరకు మొత్తం 480 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,991 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 11,906 మందికి చికిత్స అందుతోంది. 24 గంటల్లో భారత్‌లో 991 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

 

24 గంటల్లో మొత్తం 43 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.  అయితే గత నెల 24 నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దాంతో ఎక్కడ రావాణా వ్యవస్థ అక్కడే స్థంభించిపోయింది.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో ఉన్న ల‌క్ష‌మందికి పైగా వ‌ల‌స కార్మికుల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల‌కు చెందిన‌ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల్లో ప‌ని చేసే సుమారు ల‌క్షా 31 వేల మంది కార్మికుల‌ను వారి సొంత జిల్లాల‌కు పంపేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే వారంద‌రికి క‌రోనా టెస్టులు చేసి నెగిటివ్ వ‌స్తేనే పంపిస్తామ‌ని పేర్కొంది. 

 

మొన్నామద్య బాంద్రాలో వలస కూలీలపై పోలీస్ లాఠీ చార్జ్ చేసిన విషయం తెలిసిందే.   వీరంతా 38 షుగర్ ఫ్యాక్టరీలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.  కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి లాక్ డౌన్ చేశారు. దాంతో వీరంతా అక్కడే చిన్న షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. టీవ‌ల‌ వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్తామంటూ నిర‌స‌న‌ల‌కు దిగుతున్న‌ నేప‌థ్యంలో వారిని త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: