బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నిన్నటి రోజు అనగా బుధవారం నాడు మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇర్ఫాన్ ఖాన్ మృతితో బాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అంతేకాకుండా సినీనటులు, రాజకీయ నేతలు ప్రముఖులు కూడా ఇర్ఫాన్ ఖాన్ కి సంతాపం తెలియజేయడం జరిగింది. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయిందని చెప్పాలి. ఈ తరుణంలోనే ఇర్ఫాన్ కు ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన రీతిలో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. 

 


ఒడిస్సా రాష్ట్రంలోని పూరి బీచ్ లో ఇర్ఫాన్ ఖాన్ సైకత శిల్పాన్ని చిత్రీకరించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం తోపాటు తన ప్రత్యేకతను ఆయన చాటుకోవడం జరిగింది. అలాగే ఇర్ఫాన్ ఖాన్ చిత్రానికి పక్కనే మిస్ యూ ఇర్ఫాన్ అని కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రఖ్యాత 'లైఫ్ ఆఫ్ పై' చిత్రంలో ఇర్ఫాన్ చెప్పిన 'నాట్ టేకింగ్ ఏ మూవ్‌మెంట్ టు సే గుడ్ బై డైలాగు' ను తాను రూపొందించిన సైకత శిల్పం లో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఆ ప‌క్క‌నే RIP అని కూడా రాశారు. 

 

ఆ తర్వాత తన ప్రత్యేకత చాటుకున్న సైకత శిల్పి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా చేసుకొని సుదర్శన్ పట్నాయక్ షేర్ చేయడం జరిగింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు " నా హృదయపూర్వక శ్రద్ధాంజలి " అంటూ సోషల్ మీడియా వేదికగా చేసుకొని పోస్ట్ చేయడం జరిగింది. ఇర్ఫాన్‌ ఖాన్ కు నివాళిగా పూరీ నగరంలోని బీచ్‌ లో నేను రూపొందించిన సైకత శిల్పం ఇది ' అంటూ మెసెజ్ పోస్ట్ చేశారు సుదర్శన పట్నాయక్. ఈయన ఎప్పటికప్పుడు తనకంటూ ప్రత్యేకత గుర్తింపును పొందుతుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: