మామూలుగా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం అనేది పనిచేస్తుంది. ఒకే పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి ఎలాంటి ప్రతిపక్షం లేకపోతే ఆ పార్టీ ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోతుంది. అందుకే ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం ఉంటే బాగుంటుంది అని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఒక పార్టీపై అపనమ్మకంతో ఇంకొక పార్టీకి ఓటు వేసి గెలిపిస్తు ఉన్నారు ప్రస్తుతం ప్రజలు. అయితే ఎలాగో ప్రజల నుంచి ఓట్లు రాబట్టాలి కాబట్టి అధికార పక్షంపై ఎప్పుడూ దుమ్మెత్తి పోయడం సరైన పద్ధతి కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

 రాష్ట్రంలో ఎప్పుడూ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాత్రమే హుందా తనంగా  ఉంటుంది అని అంటున్నారు. అయితే 2004 ఈ మధ్య కాలం లో ఉన్నటువంటి ఎంతో వ్యూహాత్మకమైన తెలివితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 2014 తర్వాత అధికారం చట్రంలో  కీలుబొమ్మగా మారిపోయాడు అంటున్నారు విశ్లేషకులు. లేదా కొంతమంది చుట్టూ చేరినటువంటి నేతల  కారణంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. పరిగెత్తాల్సిన  పరిస్థితులో  నడుస్తుండడం పాకుతూ  ఉండటం లాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు. 

 


 అయితే తాజాగా తెలుగు తమ్ముళ్ల నుంచి  ఒక వ్యక్తి సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ కి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అవినీతి అనేది అసలు విషయమే కాదు అన్నది మొన్నటికి మొన్న ఎన్నికల్లో ప్రజలు తేల్చారు. మీరు ఏమన్నా ఏం చేసినా అది ప్రజలకు  ఏం పోతుంది ఎలా పోతుంది అనే విషయాన్ని చెప్పండి. లేదంటే లోక్సత్తా జనసేన కమ్యూనిస్టు లతో పాటు టిడిపి కూడా ఇంకో పార్టీగా  మారిపోతుందని.. మనం వేసే ప్రశ్నలు జనం గొంతులో నుంచి వచ్చే ప్రశ్నలు అయినంత వరకు రాజకీయాల్లో మంచి ప్రస్థానం ఉంటుందని... అయితే ప్రాక్టికల్ సొల్యూషన్స్ అంటూ టీడీపీ క్రమక్రమంగా జనాల మనసులో నుంచి దూరం అవుతుందేమో ఒక సారి ఆలోచించుకోండి అంటూ ఓ పోస్టు పెట్టాడు తెలుగు తమ్ముడు. అయితే ఈ సలహా పై టిడిపి కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: