విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కలకలం రేపింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎన్నో గ్రామాల ప్రజలు సైతం ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఎంతో మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించి ఇప్పటికే బాధిత కుటుంబాలకు అందించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఘటనపై ప్రతిపక్ష టీడీపీ మాత్రం విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై విమర్శల పర్వం తో ఆంధ్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అయితే విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగిన ఆర్ఆర్ వెంకటాపురం కి వెళ్ళిన టిడిపి నేతలను పోలీసులు అడ్డుకుని ప్రమాద స్థలిని పరిశీలించకుండా అరెస్టులు చేయడం పై టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడుతూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

 

 

 విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం ఏదో కావాలనే దాస్తున్నారనే అనుమానం కలుగుతోంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను అరెస్టు చేయడం దారుణమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గ్యాస్ లీకేజీ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆర్ఆర్  వెంకటాపురం వెళుతున్న విశాఖ టీడీపీ నేతలు బండారు సత్యానంద మూర్తి మిగిలిన నేతలు పోలీసులు అడ్డుకొని.. బాధితుల వద్దకు వెళ్లకుండా వెళ్లకుండా అరెస్ట్  చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అక్కడి పరిస్థితులు అన్నీ ప్రస్తుతం సాధారణ పరిస్థితికి వచ్చాయి అని చెబుతున్న అధికార పార్టీ...  ప్రతిపక్ష పార్టీ నేతలను  మాత్రం సంఘటన స్థలానికి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. 

 

 

 తనకు అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వం విషవాయువులను నియంత్రించడంలో విఫలమైంది అంటూ తెలిసిందని... ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆసుపత్రి పాలయ్యారు అని  స్థానికులు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటున్నారు అనే సమాచారం తన వద్దకు వచ్చింది అంటూ చంద్రబాబు తెలిపారు. ఇక వైసీపీ మంత్రులు అందరూ కేవలం ఫొటోస్ షూట్స్  కోసం మాత్రమే గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన స్థలంలో గడిపారని.. కానీ బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు టిడిపి నేతలు వెళ్తే వైసిపి మాత్రం కుట్రపూరితంగా అనుమతించ కుండా అరెస్ట్ చేసింది  అంటూ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: