తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్  విధానం కొన్ని సడలింపులతో అమలు అవుతుంది. ఇక లాక్ డౌన్  సమయంలో కూడా కొన్నిచోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో మళ్లీ దేశవ్యాప్తంగా యాక్సిడెంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక అసలు విషయానికి వెళితే ... తాజాగా కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో చెట్టును ఢీకొనడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. 

 

IHG


అసలు పూర్తి వివరాల్లోకి వెళితే విజయవాడ - హైదరాబాద్ రోడ్ లో కంచికచర్ల మండలం కీసరలో గ్రామ పరిధిలో ఇన్వెంటర్ ఆఫ్ కెమికల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. దీనితో టాటా ఏసీ ట్రక్ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఇక ఆటో చెట్టును ఢీకొనడంతో ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఆటో చెట్టును బలంగా ఢీ కొట్టడంతో డ్రైవర్ శరత్ ఆటోలోనే చిక్కుకోవడం జరిగింది. దీనితో డ్రైవర్ నరక యాతన అనుభవించాడు.

 

IHG's son sent to one-day <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POLICE' target='_blank' title='police-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>police</a> ...


ఇక ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను  వాహనదారులు 108 కు సమాచారం తెలియడంతో వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయం అందించారు. ఇక చివరికి డ్రైవర్ ను వాహనం నుంచి బయటకు తీసుకొని వచ్చి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అధికారులు తెలియజేసిన సమాచారం మేరకు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: